News August 3, 2024

రేవంత్‌ది ప్రజాపాలన కాదు.. పంజా పాలన: ప్రశాంత్‌రెడ్డి

image

TG: రేవంత్ సర్కార్‌ది ప్రజా పాలన కాదని ప్రతిపక్షంపై పంజా పాలన అని BRS నేత ప్రశాంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. 7నెలల్లోనే ఆయన వికృత రూపం బయటపడిందని, ప్రజలకు ఈ దౌర్భాగ్యం కలిగినందుకు తాను బాధపడుతున్నానన్నారు. కాంగ్రెస్‌తో స్నేహపూర్వకంగా ఉన్న MIM MLA అక్బరుద్దీన్ కూడా ప్రభుత్వాన్ని తప్పుబట్టారని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సభలో అబద్ధాలు చెబుతూ కళ్లుండి చూడలేని కబోదిలా CM వ్యవహరిస్తున్నారన్నారు.

Similar News

News March 19, 2026

‘పుష్ప-2’ రికార్డు బద్దలైంది!

image

‘ధురంధర్-2’ భారత సినిమా రికార్డులను తిరగరాస్తోంది. ‘బుక్ మై షో’లో ఒక్క గంటలోనే రికార్డు స్థాయిలో 1.09 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. గతంలో ఈ రికార్డు పుష్ప-2 (1.07 లక్షలు) పేరిట ఉండేది. వీకెండ్స్‌లో ఈ మూవీ టికెట్ సేల్స్ మరింతగా పెరుగుతాయని, భారీ కలెక్షన్లు పక్కా అని నెటిజన్లు అంటున్నారు. కాగా గతేడాది వచ్చిన ధురంధర్ దాదాపు రూ.1,350 కోట్లు వసూలు చేసింది.

News March 19, 2026

పంచాంగ పఠనం.. రాష్ట్రానికి ఆర్థిక ప్రగతి ఉంటుందన్న మాడుగుల

image

AP: ప్రభుత్వం విజయవాడలో నిర్వహించిన ఉగాది సంబరాల్లో మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ పఠనం చేశారు. పరాభవ నామ సంవత్సరంలో ప్రభుత్వానికి విజయం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. లగ్నాల ప్రకారం ఈ ఏడాది వర్షపాతం బాగానే ఉంటుందని.. ఉగాదికి ముందుగానే కురిసిన వర్షం దీనికి సూచిక అని తెలిపారు. అమరావతి విశ్వనగరిగా ఎదుగుతుందని.. రాష్ట్రానికి ఆర్థిక ప్రగతి ఉంటుందని చెప్పారు. ప్రజలు సుఖ శాంతులతో ఉంటారని వివరించారు.

News March 19, 2026

PNG.. జిల్లాల వారీగా ఈ కంపెనీల సర్వీసులు

image

ఏపీలోని అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో THINK GAS అనే కంపెనీ PNG సర్వీసును అందిస్తోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో IOCL, ఉభయగోదావరిలో గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్, విజయవాడ, కాకినాడలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్(BGL), కృష్ణాలో మెగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు సేవలు అందిస్తున్నాయి. HYDలో BGL, పలు జిల్లాల్లో IOCL సర్వీసులు ఉన్నాయి.