News August 3, 2024

భారత్‌తో మ్యాచ్.. శ్రీలంకకు బిగ్ షాక్?

image

భారత్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో మిగతా రెండు మ్యాచులకు శ్రీలంక ప్లేయర్ హసరంగా దూరమైనట్లు సమాచారం. గాయం కారణంగా అతడు వైదొలిగినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆ జట్టు పేసర్లు పతిరణ, మధుశంక గాయాలబారిన పడి సిరీస్‌లో ఆడట్లేదు. ఇప్పుడు హసరంగా లాంటి కీలక బౌలర్ దూరం కావడం SLకు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. INDvsSL మొదటి వన్డే టై అవగా, రేపు రెండో వన్డే జరగనుంది.

Similar News

News March 3, 2026

ఏ పంటల్లో ఎలాంటి ఎర పంటలను వేస్తే మంచిది?

image

☛ పత్తి, వేరుశనగ చుట్టూ ఆముదపు పంటను ఎర పంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులను నివారించవచ్చు. ☛ క్యాబేజీలో ఆవాల పంటను వేసి డైమండ్ బ్యాక్ మాత్‌ను నివారించవచ్చు. ☛ వేరుశనగలో అలసందలు వేసి ఎర్రగొంగళి పురుగుల ఉద్ధృతి తగ్గించవచ్చు. ☛ అలసందలు పంటలో ఆవాలును ఎర పంటగా వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు మొక్కలను నాటి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు.

News March 3, 2026

హోలీ ఆఫర్ల పేరుతో లింక్స్.. క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ!

image

TG: హోలీ పండగను క్యాష్ చేసుకునేందుకు సైబర్ కేటుగాళ్లు రెడీ అయ్యారు. రంగులు, గిఫ్ట్స్, ఈవెంట్ పాస్‌ల మీద భారీ డిస్కౌంట్లు ఉన్నాయంటూ వాట్సాప్, SMSలలో ఫేక్ లింకులు పంపుతున్నారు. వీటిపై క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ హెచ్చరించారు. పొరపాటున మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని ఆమె సూచించారు.

News March 3, 2026

రాష్ట్రంలో మళ్లీ వర్షాలు!

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం 4 రోజుల్లో ఉపరితల ద్రోణిగా విస్తరించే ఆస్కారముందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని చాలాచోట్ల ఎండ తీవ్రత ఉంటుందని హెచ్చరించింది. అయినా అల్లూరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పొగమంచు కురుస్తుందని చెప్పింది. ఇక నిన్న దేశంలోనే కర్నూలులో అత్యధికంగా 38°C నమోదైంది.