News August 3, 2024
భారత్‌తో మ్యాచ్.. శ్రీలంకకు బిగ్ షాక్?
భారత్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో మిగతా రెండు మ్యాచులకు శ్రీలంక ప్లేయర్ హసరంగా దూరమైనట్లు సమాచారం. గాయం కారణంగా అతడు వైదొలిగినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆ జట్టు పేసర్లు పతిరణ, మధుశంక గాయాలబారిన పడి సిరీస్‌లో ఆడట్లేదు. ఇప్పుడు హసరంగా లాంటి కీలక బౌలర్ దూరం కావడం SLకు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. INDvsSL మొదటి వన్డే టై అవగా, రేపు రెండో వన్డే జరగనుంది.
Similar News
News September 13, 2024
APPLY: BISలో 315 ప్రభుత్వ ఉద్యోగాలు
ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియాలో 315 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. సీనియర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, పర్సనల్ అసిస్టెంట్ విభాగాల్లో ఖాళీలున్నాయి. అభ్యర్థులు SEP 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. విద్యార్హత, వయో పరిమితి, జీతభత్యాల వివరాల కోసం ఈ <
News September 13, 2024
ఈ శతాబ్దపు అత్యుత్తమ టెస్ట్ పేసర్లు ఎవరు..?
21వ శతాబ్దంలో క్రికెట్‌లో ఎంతోమంది బౌలర్లు వచ్చారు, వెళ్లారు. మరి వీరందరిలో అత్యుత్తమ టెస్టు బౌలర్లు ఎవరు? దీనిపై నిపుణుల ప్యానెల్ సాయంతో క్రిక్‌ఇన్ఫో ఓ జాబితా తయారు చేసింది. డేల్ స్టెయిన్ అందులో అగ్రస్థానంలో నిలిచారు. తర్వాత వరసగా జేమ్స్ ఆండర్సన్, జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్, రబాడ, స్టువర్ట్ బ్రాడ్, ట్రెంట్ బౌల్ట్, వెర్నన్ ఫిలాండర్ ఉన్నారు. మరి మీ దృష్టిలో బెస్ట్ బౌలర్ ఎవరు? కామెంట్ చేయండి.
News September 13, 2024
పోర్ట్ బ్లెయిర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే..
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్‌ను<<14093820>> కేంద్రం శ్రీవిజయపురంగా మార్చిన<<>> సంగతి తెలిసిందే. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ ప్రభుత్వం ఈ దీవుల్లో కాలనీలను ప్రారంభించాలని భావించింది. దానికోసం ఆర్చిబాల్డ్ బ్లెయిర్ అనే అధికారిని 1788లో తమ ప్రతినిధిగా నియమించింది. బ్రిటన్ సిబ్బంది, సేవకులతో కలిసి ఆయన ఇక్కడ నివసించేవారు. కాలక్రమంలో అతడి పేరునే రాజధానికి పోర్ట్ బ్లెయిర్‌గా పెట్టారు.