News August 4, 2024
YCP నేతలు జైలుకు పోవడం ఖాయం: BJP MLA

AP: గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన YCP నేతలందరూ జైలుకెళ్లడం ఖాయమని జమ్మలమడుగు BJP MLA ఆదినారాయణరెడ్డి అన్నారు. ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు దోచేశారని ఆరోపించారు. ‘వచ్చే ఎన్నికల్లో పులివెందులలో జగన్‌ను ఓడిస్తాం. 200 సీట్లు గెలుచుకుని ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది. సీఎం చంద్రబాబు పరిపాలన బాగా చేస్తున్నారు. మోదీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News March 20, 2026
ధురంధర్-2తో బాక్సాఫీసు షేక్.. రికార్డులు బ్రేక్!

ధురంధర్-2 బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. మొదటిరోజే ₹102.55కోట్ల నెట్ సాధించిన ఈ చిత్రం ఒక్క హిందీ వర్షన్‌తోనే ₹99.10Cr రాబట్టింది. బాలీవుడ్ సినిమాల్లో ఇదే అత్యధికం. ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 (₹275.2కోట్లు) తర్వాత బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన రెండో భారతీయ సినిమాగా ధురంధర్-2 (₹236.63Cr) నిలిచింది. పెయిడ్ ప్రివ్యూల్లో OG (₹25కోట్లు)ని బీట్ చేసి ₹43కోట్లు వసూలు చేసింది.
News March 20, 2026
CRDA కొత్త కమిషనర్‌గా విజయరామరాజు

AP: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబును పౌరసరఫరాల కమిషనర్‌గా నియమించింది. ఆయన స్థానంలో CRDA కమిషనర్‌గా విజయరామరాజు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక మార్కాపురం కలెక్టర్‌గా విజయ సునీత, పోలవరం కలెక్టర్‌గా దినేశ్ కుమార్ నియమితులయ్యారు.
News March 20, 2026
మెడికల్ పీజీ సీట్ల భర్తీ.. సుప్రీంకోర్టుకు కాలేజీలు

AP, TGలో ఖాళీగా ఉన్న మెడికల్ సీట్ల భర్తీపై కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. FEB 28తో కౌన్సెలింగ్ ముగియగా ఏపీలో 246, టీజీలో 377 పీజీ సీట్లు భర్తీ కాలేదని తెలిపాయి. కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నప్పటికీ కౌన్సెలింగ్ గడువును పొడిగించలేదన్నాయి. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.


