News August 4, 2024
YCP నేతలు జైలుకు పోవడం ఖాయం: BJP MLA
AP: గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన YCP నేతలందరూ జైలుకెళ్లడం ఖాయమని జమ్మలమడుగు BJP MLA ఆదినారాయణరెడ్డి అన్నారు. ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు దోచేశారని ఆరోపించారు. ‘వచ్చే ఎన్నికల్లో పులివెందులలో జగన్‌ను ఓడిస్తాం. 200 సీట్లు గెలుచుకుని ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది. సీఎం చంద్రబాబు పరిపాలన బాగా చేస్తున్నారు. మోదీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News September 21, 2024
అక్కినేని ఫ్యామిలీ PHOTO
ANR శతజయంతి వేడుకల్లో అక్కినేని ఫ్యామిలీ సందడి చేసింది. నాగేశ్వరరావు ఇద్దరు కొడుకులు వెంకట్, నాగార్జున, ముగ్గురు కూతుళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఒకే వేదికపై కనిపించారు. హీరోలు నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్‌తో పాటు నటి సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫ్యామిలీ ఫొటోను అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
News September 21, 2024
బర్త్ డే రోజు బెస్ట్ ఫిగర్స్.. రఫ్ఫాడించిన రషీద్
అఫ్గాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించారు. పుట్టినరోజున వన్డేల్లో బెస్ట్ ఫిగర్స్(9-1-19-5) నమోదుచేసిన క్రికెటర్‌గా నిలిచారు. 2007లో ఫిలాండర్(12 పరుగులకు 4 వికెట్లు)VS ఐర్లాండ్, 2010లో స్టువర్ట్ బ్రాడ్(44కు 4 వికెట్లు)VS ఆసీస్ బర్త్ డే రోజున అదరగొట్టారు. కాగా నిన్న మ్యాచ్ అనంతరం రషీద్ పిచ్‌కు ముద్దు పెట్టి ఎమోషనల్ అయ్యారు.
News September 21, 2024
చెత్త పన్ను వసూలు చేయొద్దని సీఎం ఆదేశం?
AP: నగరాలు, పట్టణాల్లో చెత్త పన్నును వసూలు చేయొద్దని CM చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల పురపాలక శాఖపై సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ‘చెత్త పన్ను రద్దు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. ఇకపై వసూలు చేయొద్దు’ అని అధికారులకు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చెత్త తరలింపునకు అయ్యే ఖర్చును కార్పొరేషన్లు, మున్సిపాలిటీలే భరించాలని చెప్పినట్లు పేర్కొన్నాయి.