News August 4, 2024
Olympics: నీరజ్‌పైనే ‘బంగారు’ ఆశలు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకు కేవలం 3 కాంస్య పతకాలు సాధించిన IND.. మెడల్ టేబుల్‌లో 54వ స్థానంలో నిలిచింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాపైనే భారత్ మరోసారి ఆశలు పెట్టుకుంది. ఎల్లుండి అతడు బరిలోకి దిగనున్నారు. అటు హాకీ టీమ్ కూడా సెమీస్ చేరడంతో స్వర్ణంపై ఆశలు చిగురిస్తున్నాయి.
<<-se>>#Olympics2024<<>>
Similar News
News April 1, 2026
₹50 నుంచి ₹కోట్ల రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి..!

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తొలినాళ్లలో రెమ్యునరేషన్ గురించి తోటి నటుడు శ్రీనివాసన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 1980లో ‘విలక్కనుండు స్వప్నంగళ్’ అనే సినిమాలో చేసిన పాత్రకు మమ్ముట్టికి ఇచ్చింది 50 రూపాయలేనని తెలిపారు. అందులో గుర్తింపు రావడంతో ఆ తర్వాత సినిమా ‘మేళా’కు ₹800 అందుకున్నారని చెప్పారు. ఆ ₹800లకే మమ్ముట్టి ఎంతో సంతోషపడ్డారని అన్నారు. కాగా ప్రస్తుతం మమ్ముట్టి ₹10-20Cr అందుకుంటున్నారు.
News April 1, 2026
అమరావతికి చట్టబద్ధత.. నేడే పార్లమెంట్‌లో బిల్లు

ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్ ముందుకు రానుంది. 2024 జూన్ 2 నుంచే రాజధానిగా గుర్తించేలా ఏపీ పునర్‌వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు-2026ను లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెడతారు. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదిస్తారు. గురువారం రాజ్యసభలోనూ దీన్ని ఆమోదించి, శాశ్వత రాజధానికి చట్టబద్ధత కల్పిస్తారు.
News April 1, 2026
ఎలాంటిచోట గొప్పతనం చూపకూడదు?

అనువుగానిచోట నధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువ గాదు
కొండ యద్దమందు కొంచమై యుండదా?
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: ఒక పెద్ద కొండ ముందు అద్దం పెట్టి చూస్తే ఆ కొండ చిన్నగా కనిపిస్తుంది. నిజానికి ఆ కొండ స్థాయి తగ్గలేదు. అలాగే మనకు తగని ప్రదేశం లేదా సమయంలో గొప్పతనం చూపకూడదు. అలా తగ్గి ఉన్నప్పటికీ మన స్థాయి తగ్గిపోదు.
<<-se>>#PADHYAM<<>>


