News August 4, 2024

Olympics: నీరజ్‌పైనే ‘బంగారు’ ఆశలు

image

పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకు కేవలం 3 కాంస్య పతకాలు సాధించిన IND.. మెడల్ టేబుల్‌లో 54వ స్థానంలో నిలిచింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాపైనే భారత్ మరోసారి ఆశలు పెట్టుకుంది. ఎల్లుండి అతడు బరిలోకి దిగనున్నారు. అటు హాకీ టీమ్ కూడా సెమీస్ చేరడంతో స్వర్ణంపై ఆశలు చిగురిస్తున్నాయి.
<<-se>>#Olympics2024<<>>

Similar News

News September 15, 2024

BANతో టీ20లకు గిల్, పంత్‌ దూరం?

image

అక్టోబర్ 7 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే 3 మ్యాచుల టీ20 సిరీస్‌కు గిల్‌తో పాటు బుమ్రా, సిరాజ్, పంత్‌కు రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. వర్క్ లోడ్‌ను మేనేజ్ చేసేందుకు, రాబోయే టెస్ట్ సిరీస్‌ల దృష్ట్యా వీరికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో టీ20 టీమ్‌కు ఎవరెవరు సెలక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చే ఛాన్సుంది.

News September 15, 2024

చేతబడి చేశారనే అనుమానంతో కుటుంబంలో ఐదుగురిని చంపేశారు

image

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేశారనే అనుమానంతో కుంట పీఎస్ పరిధి ఇట్కల్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య చేశారు. వారు చేతబడి చేయడంతోనే తమ కుటుంబంలోని వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడని భావించిన మరో కుటుంబం వీరిని దారుణంగా హతమార్చింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

News September 15, 2024

కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తుంది: రేవంత్

image

TG: ఎన్నో ఇబ్బందుల మధ్య సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేశామని తెలిపారు. గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తుందన్నారు. మహాలక్ష్మీ పథకంలో ఇప్పటి వరకు మహిళలు 85 కోట్ల ప్రయాణాలు చేశారని వెల్లడించారు. మోదీ, KCR హయాంలో గ్యాస్ సిలిండర్ రేట్లు భారీగా పెరిగాయని విమర్శించారు.