News August 4, 2024
శ్రీలంకతో రెండో వన్డే.. భారత్ ఓటమి

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియా ఓడిపోయింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన 42.2 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ (64) అక్షర్ పటేల్ (44) రాణించగా గిల్(35) ఫర్వాలేదనిపించారు. కోహ్లీ (14), దూబే (0), కేఎల్ రాహుల్ (0), అయ్యర్ (7) తీవ్రంగా నిరాశపర్చారు. ఆ తర్వాత బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. లంక బౌలర్ వండర్సే ఒక్కడే 6 వికెట్లు తీసి లంకను గెలిపించారు.
Similar News
News March 15, 2026
ఈ జిల్లాల్లో వర్షాలు!

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ మధ్యాహ్నం నుంచి రేపు 8.30am వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడటానికి ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఇక రానున్న 5 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 2-4డిగ్రీలు తగ్గుతాయంది.
News March 15, 2026
చంద్రబాబుకు అల్లు అర్జున్ థాంక్స్

AP సీఎం చంద్రబాబు నాయుడికి అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. శిరీష్, నయనిక దంపతులను <<19384357>>ఆశీర్వదించడానికి<<>> శనివారం అల్లు ఇంటికి చంద్రబాబు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ టైమ్‌లో విదేశాల్లో ఉన్న ఐకాన్ స్టార్.. చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని ఆయన Xలో పోస్ట్ చేసి సీఎంకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు.
News March 15, 2026
సిలిండర్ డోమ్ ఆకారంలోనే ఎందుకు?

LPG గ్యాస్‌ను సిలిండర్‌లో చాలా ఎక్కువ ఒత్తిడి వద్ద నింపుతారు. చతురస్రం లేదా దీర్ఘచతురస్ర ఆకారంలో ఉంటే మూలల వద్ద ఒత్తిడి ఎక్కువై పేలిపోయే ప్రమాదం ఉంటుంది. డోమ్ ఆకారంలో ఒత్తిడి అన్ని వైపులా సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలాగే సిలిండర్లను దొర్లించడం సులభం అవుతుంది. కార్మికులు మోయాల్సిన బాధ తప్పుతుంది. పూర్తిగా గుండ్రంగా ఉంటే ఒకచోట నిలపడం కష్టం. తయారీ ఖర్చు కూడా తక్కువ.


