News August 4, 2024

శ్రీలంకతో రెండో వన్డే.. భారత్ ఓటమి

image

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియా ఓడిపోయింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన 42.2 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ (64) అక్షర్ పటేల్ (44) రాణించగా గిల్(35) ఫర్వాలేదనిపించారు. కోహ్లీ (14), దూబే (0), కేఎల్ రాహుల్ (0), అయ్యర్ (7) తీవ్రంగా నిరాశపర్చారు. ఆ తర్వాత బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. లంక బౌలర్ వండర్సే ఒక్కడే 6 వికెట్లు తీసి లంకను గెలిపించారు.

Similar News

News December 12, 2025

మరణించినట్లు కలలు వస్తే.. అది దేనికి సంకేతం?

image

ఓ వ్యక్తికి తాను చనిపోయినట్లు పదేపదే కలలు వస్తుంటే భయపడాల్సిన అవసరం లేదని స్వప్నశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇది మంచి ఫలితాన్నే సూచిస్తుందని అంటున్నారు. ‘ఏదైనా సంక్షోభం లేదా మరణ ముప్పు ఇప్పటికే దాటిపోయిందని, దాని నుంచి మీరు తప్పించుకున్నారని ఈ కలలు సూచిస్తాయి. అయితే ప్రమాదానికి గురైనట్లు కలలు వస్తే దాన్ని హెచ్చరికలా భావించి జాగ్రత్తగా ఉండాలి’ అని సూచిస్తున్నారు.

News December 12, 2025

వరి నాట్లు వేసేటప్పుడు జాగ్రత్తలు(2/2)

image

వరి నారును పొలంలో నాటేముందు కొనలు తుంచి నాటాలి. దీని వల్ల నారు కొనలలో కాండం తొలుచు పురుగు, ఇతర పురుగులు పెట్టిన గుడ్లను నాశనం చేయవచ్చు. నాట్లు పైపైనే 3సెంటీమీటర్ల లోతులోనే నాటాలి. దీనివల్ల మొక్కల్లో పిలకలు ఎక్కువగా వస్తాయి. నాటేటప్పుడు పొలంలో ప్రతి 2 మీటర్ల దూరానికి 20 సెం.మీ కాలిబాటలు వదలాలి. కాలిబాటలు తూర్పు పడమర దిశగా ఉంచాలి. దీనివల్ల మొక్కలకు గాలి, వెలుతురు బాగా అంది చీడల సమస్య తగ్గుతుంది.

News December 12, 2025

TG న్యూస్ అప్డేట్స్

image

* HYD వేదికగా ఈ నెల 19 నుంచి 21 వరకు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌ జరగనుంది. ప్రదర్శనకు 700+ షార్ట్ ఫిల్మ్స్ రాగా 60 ఎంపికయ్యాయి.
* పలువురు కాంగ్రెస్ MLAలు, నాయకులకు క్యాబినెట్ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ ఎర్రోళ్ల శ్రీనివాస్(BRS) హైకోర్టులో పిల్ వేశారు.
* వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ల గడువును పొడిగించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు MP అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు.