News August 5, 2024
అజిత్‌తో ప్రశాంత్ నీల్ కేజీఎఫ్-3?

ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సిరీస్ ఏ స్థాయిలో హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు కేజీఎఫ్-3పై నీల్ దృష్టి పెట్టారు. ఇందులో హీరో యశ్ కాదట. తమిళ హీరో అజిత్‌తో దీన్ని తెరకెక్కించనున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన అగ్రిమెంట్‌పై సంతకం చేశారని పేర్కొన్నాయి. మొదలైతే ఆయన కెరీర్లో ఇది 64వ సినిమా కానుంది. అయితే, దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.
Similar News
News March 20, 2026
కొత్త ఫోన్లలో ఆధార్ యాప్?

కొత్త మొబైల్స్‌లో డిఫాల్ట్‌గా ఆధార్ యాప్‌ను తీసుకొచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది. యూజర్లు న్యూ మొబైల్ ఆన్ చేసినప్పుడే ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఆధార్ దుర్వినియోగాన్ని అడ్డుకోవచ్చని కేంద్రం చెబుతోంది. ఈ మేరకు స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు ఈ ఏడాది జనవరిలో ఈ-మెయిల్ చేసింది. అయితే ఈ ప్రతిపాదనను యాపిల్, శామ్‌సంగ్, గూగుల్ తిరస్కరించాయి.
News March 20, 2026
తెలంగాణ తలసరి ఆదాయం ₹4,18,931

* రెవెన్యూ వ్యయం: ₹2,34,406 కోట్లు
* మూలధన వ్యయం: ₹47,267 కోట్లు
* తలసరి ఆదాయం: ₹4,18,931 (జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే 1.9% ఎక్కువ)
* రాష్ట్ర వృద్ధి రేటు: 10.2% (జాతీయ వృద్ధి రేటు కంటే 2.7% ఎక్కువ)
* GSDP: ₹17.82 లక్షల కోట్లు
News March 20, 2026
TG బడ్జెట్ కేటాయింపులు.. ఏ శాఖకు ఎంత?

☛ గృహ నిర్మాణం: రూ.7,430కోట్లు ☛ ST సంక్షేమం: రూ.7,937కోట్లు ☛ BC సంక్షేమం: రూ.12,511కోట్లు ☛ మైనార్టీ సంక్షేమం: రూ.3,769కోట్లు ☛ యువ వికాసం: రూ.6వేల కోట్లు ☛ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి: రూ.33,688 కోట్లు ☛ సాగునీటి ప్రాజెక్టులకు: రూ.22,615కోట్లు ☛ రవాణా, R&B: రూ.12,789కోట్లు ☛ పురపాలక, పట్టణాభివృద్ధి: రూ.17,907కోట్లు ☛ హోంశాఖ: రూ.11,907కోట్లు ☛ విద్యాశాఖ: రూ.26,674 కోట్లు


