News August 5, 2024
అజిత్‌తో ప్రశాంత్ నీల్ కేజీఎఫ్-3?
ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సిరీస్ ఏ స్థాయిలో హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు కేజీఎఫ్-3పై నీల్ దృష్టి పెట్టారు. ఇందులో హీరో యశ్ కాదట. తమిళ హీరో అజిత్‌తో దీన్ని తెరకెక్కించనున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన అగ్రిమెంట్‌పై సంతకం చేశారని పేర్కొన్నాయి. మొదలైతే ఆయన కెరీర్లో ఇది 64వ సినిమా కానుంది. అయితే, దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.
Similar News
News September 8, 2024
ఆధార్ కార్డుల జారీపై అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలో అక్రమ వలసలను అడ్డుకునేందుకు ఆధార్ కార్డుల జారీ విషయంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు కావాలంటే తప్పనిసరిగా NRC నంబర్‌ను సమర్పించాలని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందన్నారు. రాష్ట్ర జనాభా కంటే ఆధార్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు.
News September 8, 2024
నేటితో ముగియనున్న పారిస్ పారాలింపిక్స్
పారిస్ పారాలింపిక్స్ నేటితో ముగియనున్నాయి. ఆగస్టు 28న ప్రారంభమైన ఈ పోటీలు 11 రోజులపాటు కొనసాగాయి. 216 పతకాలతో చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ 29 పతకాలతో 16వ ప్లేస్‌లో ఉంది. మొత్తం 4,463 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. 22 క్రీడల్లో 549 విభాగాల్లో పోటీలు జరిగాయి. ఇండియా నుంచి 84 మంది అథ్లెట్లు పారాలింపిక్స్‌లో పాల్గొన్నారు. 25 పతకాలు సాధించాలనే లక్ష్యాన్ని మన దేశం నెరవేర్చుకుంది.
News September 8, 2024
త్వరలో ‘సై’ రీరిలీజ్
రాజమౌళి డైరెక్షన్‌లో నితిన్ నటించిన ‘సై’ సినిమా మళ్లీ థియేటర్లలో అలరించనుంది. త్వరలోనే రీరిలీజ్ తేదీని ప్రకటిస్తామని డిస్ట్రిబ్యూషన్ సంస్థ మెగా ప్రొడక్షన్ వెల్లడించింది. రగ్బీ ఆట కథాంశంతో ఎమోషనల్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందింది. 2004లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో జెనీలియా, శశాంక్, ప్రదీప్ రావత్, రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి, వేణు మాధవ్ కీలక పాత్రల్లో నటించారు.