News August 5, 2024
GREAT.. ఒక్కరికే నాలుగు ఉద్యోగాలు

TG: ఈ రోజుల్లో ఒక్క ఉద్యోగం వచ్చేందుకే నానాకష్టాలు పడుతుంటే నల్గొండకు చెందిన చింతల తులసికి ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పటికే గ్రూప్-4, పాలిటెక్నిక్ లెక్చరర్ జాబ్స్ సాధించిన ఆమె ఏప్రిల్ 24న ఏఈ, ఆగస్టు 2న ఏఈఈ కొలువులు దక్కించుకున్నారు. పోటీ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేందుకు ఆర్థిక పరిస్థితులు ఎదురైతే ట్యూషన్లు చెప్పి డబ్బులు సమకూర్చుకున్నట్లు ఆమె తెలిపారు.
Similar News
News March 13, 2026
రెస్టారెంటు బిల్లులో ‘LPG సర్‌ఛార్జ్’

బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో పలు రెస్టారెంట్లు బిల్లులో ‘LPG సర్‌ఛార్జ్’ కలిపి వేస్తున్నాయి. గ్యాస్ కొరతతో ఉన్న నిల్వలనే వాడుకోవాల్సి రావడం, ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ.10-30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. అటు హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో టిఫిన్ రేట్లు పెరిగిపోయాయి. సాధారణంగా రూ.30-40 ఉండే మసాలా దోశ ధరను రూ.60కి పెంచేశారు.
News March 13, 2026
ఈనెల 18 నుంచి పెళ్లిళ్లు.. గ్యాస్ కొరతపై ఆందోళన

ఈనెల 18 నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలుకానుంది. యుద్ధం వల్ల ఏర్పడిన గ్యాస్ కొరత ప్రభావం పెళ్లి భోజనాలపై పడనుంది. ఫంక్షన్లకు పెద్ద ఎత్తున వంటలు చేసే క్యాటరింగ్ నిర్వాహకులు గ్యాస్ స్టవ్‌లను ఉపయోగిస్తుంటారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో వంటలు ఎలా చేయాలనే ఆందోళన మొదలైంది. ఇక కట్టెల పొయ్యిపైనే వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కట్టెలకూ డిమాండ్ పెరుగుతుండడంతో వివాహాలు చేసే కుటుంబాలపై మరింత భారం పడనుంది.
News March 13, 2026
పాక్ ప్లేయర్ కొనుగోలుపై వివాదం.. సన్‌రైజర్స్‌కు షాక్!

‘The Hundred’ టోర్నీకి <<19366541>>పాక్<<>> ఆటగాడు అబ్రార్‌ను కొని విమర్శలు ఎదుర్కొంటున్న సన్‌రైజర్స్ ఫ్రాంచైజీకి మరో షాక్ తగిలింది. సన్‌రైజర్స్ లీడ్స్ X అకౌంట్ సస్పెండ్ అయింది. రూల్స్ ఉల్లంఘించిన అకౌంట్లను X సస్పెండ్ చేస్తుందని ఆ పేజ్‌లో ఉంది. యూజర్లు రిపోర్ట్ చేయడం ఓ కారణంగా తెలుస్తోంది. ఫ్రాంచైజ్ ఓనర్ కావ్యా మారన్‌పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ ఐపీఎల్‌లో SRH మ్యాచ్‌లు బాయ్‌కాట్ చేయాలని SMలో ట్రెండ్ చేస్తున్నారు.


