News August 5, 2024
GREAT.. ఒక్కరికే నాలుగు ఉద్యోగాలు
TG: ఈ రోజుల్లో ఒక్క ఉద్యోగం వచ్చేందుకే నానాకష్టాలు పడుతుంటే నల్గొండకు చెందిన చింతల తులసికి ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పటికే గ్రూప్-4, పాలిటెక్నిక్ లెక్చరర్ జాబ్స్ సాధించిన ఆమె ఏప్రిల్ 24న ఏఈ, ఆగస్టు 2న ఏఈఈ కొలువులు దక్కించుకున్నారు. పోటీ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేందుకు ఆర్థిక పరిస్థితులు ఎదురైతే ట్యూషన్లు చెప్పి డబ్బులు సమకూర్చుకున్నట్లు ఆమె తెలిపారు.
Similar News
News September 19, 2024
ఆ సంస్థ ఉద్యోగులకు ఇండియా హెడ్ మెయిల్
పనిఒత్తిడి కారణంగా 26 ఏళ్ల CA మృతి చెందిన ఘటనపై EY సంస్థ India ఛైర్మన్ రాజీవ్ మేమాని ఉద్యోగులకు పంపిన మెయిల్ వెలుగులోకొచ్చింది. సంస్థలో బాధితురాలి ప్రయాణం తక్కువ కాలంలోనే ముగిసిందని, ఈ విషయంలో ఆమె తల్లిదండ్రులు తనకు రాసిన లేఖను సీరియస్‌గా పరిగణిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగులకు ఆరోగ్యకరమైన, సమతుల్య పని వాతావరణం కల్పించడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
News September 19, 2024
అశ్విన్ ఫైటింగ్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 339/6 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (102) సెంచరీతో చెలరేగారు. రవీంద్ర జడేజా (86) సహకారంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (56) అర్ధ సెంచరీతో రాణించారు. బంగ్లా బౌలర్లలో హసన్ మొహమూద్ 4, రానా, మిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
News September 19, 2024
కొత్త స్టడీ: రోజూ 3 కప్పుల కాఫీతో లాభాలు
ప్రతిరోజూ మూడు కప్పుల కాఫీ/టీ తాగడం వల్ల గుండె, జీవక్రియ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని తాజా అధ్యయనం సూచిస్తోంది. చైనాలోని సూచౌ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ చౌఫు కే బృందం 1.80 లక్షల మందిపై అధ్యయనం జరిపింది. మితంగా తీసుకొనే కెఫిన్ (3 కప్పుల కాఫీ/టీ) కార్డియోమెటబోలిక్ మల్టీమోర్బిడిటీ, కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో సాయపడుతుందని వెల్లడించింది.