News August 5, 2024

బంగ్లాలో సైనిక పాలన! ప్రధాని రాజీనామా

image

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లపై చెలరేగిన హింస దేశంలో సైనికపాలన అమలు దిశగా సాగుతోంది. ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆర్మీ హెచ్చరికలతో ఆమె దేశం విడిచి వెళ్లినట్లు బంగ్లా మీడియా కథనాలు పేర్కొన్నాయి. హసీనా ప్రత్యేక హెలీకాప్టర్‌లో ఇండియాకు వెళ్లినట్లు తెలిపాయి. అల్లర్లతో దేశం అట్టుడుకుతుండగా ఇప్పటివరకు 300 మందికిపైగా మరణించారు.

Similar News

News March 28, 2026

RR జిల్లాలో HPV వ్యాక్సినేషన్ సెంటర్లు ఇవే..!

image

రంగారెడ్డి జిల్లా పరిధిలో అనేక చోట్ల HPV వాక్సినేషన్ ప్రారంభించారు. 14 ఏళ్లు నిండి 15 ఏళ్ల లోపు బాలికలకు అందిస్తున్నారు. రాజేంద్రనగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కొండాపూర్ జిల్లా ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి ప్రాంతాల్లో వీటిని అందిస్తున్నారు. తల్లిదండ్రులతో ప్రతి ఒక్కరు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని, పిల్లలకు అందించాలని డాక్టర్లు సూచించారు.

News March 28, 2026

ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారకూడదు: స్పీకర్

image

AP రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ CM CBN అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారకూడదన్నారు. ‘శాశ్వత రాజధాని నిర్మాణానికి సీఎం సంకల్పించారు. ఆంధ్రుల ఆకాంక్షకు ఈ సభ ప్రతిరూపం. 2019లో రాజధాని ప్రగతికి అడ్డంకులు ఎదురయ్యాయి. దాన్ని శాశ్వతంగా తొలగించే యజ్ఞమిది’ అని పేర్కొన్నారు.

News March 28, 2026

అంతరిక్షంలో పిల్లలు పుడతారా?

image

అంతరిక్షంలో పునరుత్పత్తిపై జరిగిన పరిశోధనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. జీరో గ్రావిటీ వల్ల వీర్యకణాలు తమ దిశను కోల్పోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమిపై వెళ్లినట్లుగా ఇవి సరైన మార్గంలో ప్రయాణించలేకపోవడంతో అంతరిక్షంలో సహజ గర్భధారణ కష్టమని తేలింది. భవిష్యత్తులో ఇతర గ్రహాలపై నివాసాలు ఏర్పరచుకోవాలన్న ఆలోచనకు ఈ సమస్య పెద్ద సవాలుగా మారనుంది. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగనున్నాయి.