News August 5, 2024
బంగ్లాలో సైనిక పాలన! ప్రధాని రాజీనామా
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లపై చెలరేగిన హింస దేశంలో సైనికపాలన అమలు దిశగా సాగుతోంది. ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆర్మీ హెచ్చరికలతో ఆమె దేశం విడిచి వెళ్లినట్లు బంగ్లా మీడియా కథనాలు పేర్కొన్నాయి. హసీనా ప్రత్యేక హెలీకాప్టర్‌లో ఇండియాకు వెళ్లినట్లు తెలిపాయి. అల్లర్లతో దేశం అట్టుడుకుతుండగా ఇప్పటివరకు 300 మందికిపైగా మరణించారు.
Similar News
News September 11, 2024
తిరుమలలో అన్న ప్రసాద నాణ్యత మెరుగుపడిందంటున్న భక్తులు!
AP: తిరుమలలో అన్న ప్రసాద నాణ్యతపై ఇటీవల విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో టీటీడీ చర్యలకు దిగింది. క్యాంటీన్లలో తనిఖీలు చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ఆదేశించింది. టీటీడీ చర్యలతో ప్రస్తుతం తిరుమల అన్న ప్రసాదం క్వాలిటీ చాలా మెరుగైందని భక్తులు పోస్టులు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మీరు తిరుమలకు వెళ్లారా? అన్న ప్రసాద నాణ్యతపై మీ కామెంట్?
News September 11, 2024
తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
టాలీవుడ్ హీరోయిన్ చిత్రా శుక్లా తల్లి కాబోతున్నారు. ఆమె సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పిక్స్ చూసిన అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. కాగా హంట్, పులి, నేను శైలజ, సిల్లీ ఫెలోస్, రంగులరాట్నం, అహో విక్రమార్క చిత్రాల్లో ఆమె నటించారు. గతేడాది ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో పోలీస్ ఆఫీసర్ వైభవ్ ఉపాధ్యాయ్‌ను చిత్రా వివాహం చేసుకున్నారు.
News September 11, 2024
Stock Market: మార్కెట్లను డ్రైవ్ చేస్తున్న US CPI డేటా
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 25,059, బీఎస్ఈ సెన్సెక్స్ 73 పాయింట్లు ఎగిసి 81,999 వద్ద ట్రేడవుతున్నాయి. బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ టాప్ గెయినర్స్. టాటా మోటార్స్, ఓఎన్జీసీ టాప్ లూజర్స్. నేడు యూఎస్ సీపీఐ డేటా రావాల్సి ఉండటం, అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ బిగ్ డిబేట్ నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.