News August 5, 2024
ఏపీ వర్చువల్ వర్కింగ్ హబ్‌గా మారాలి: సీఎం చంద్రబాబు

AP: రాష్ట్రం వర్చువల్ వర్కింగ్ హబ్‌గా మారాలన్నదే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం ఓ విధానాన్ని రూపొందించాలని, దీనిపై ఓ వర్క్ షాప్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. ‘విద్యార్థులకు గ్లోబల్ స్థాయి ఉద్యోగాలు వచ్చేలా నైపుణ్యాలను పెంచాలి. గతంలో న్యాక్ అక్రిడేషన్‌లో ఏపీ వర్సిటీలు టాప్-10లో ఉండేవి. ఇప్పుడు ఒక్కటి కూడా లేకపోవడం శోచనీయం’ అని కలెక్టర్లతో మీటింగ్‌లో వ్యాఖ్యానించారు.
Similar News
News March 7, 2026
కల్తీ పాలు.. 10కి చేరిన మరణాలు

AP: రాజమండ్రి కల్తీ <<19289956>>పాల ఘటనలో<<>> మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ అనంతలక్ష్మి(72) అనే మహిళ చనిపోవడంతో మృతుల సంఖ్య 10కి చేరింది. తీవ్ర అనారోగ్యంపాలైన ముగ్గురు చిన్నారులు సహా 10 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురికి వెంటిలేటర్‌పై డయాలసిస్ చేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
News March 7, 2026
‘గద్దర్’ అవార్డులపై నాగ్ ప్రశంసలు

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ‘గద్దర్ అవార్డ్స్’ విజేతలకు అక్కినేని నాగార్జున శుభాకాంక్షలు తెలియజేశారు. తన తండ్రి ANR పేరిట అవార్డును ఇచ్చినందుకు CM రేవంత్ రెడ్డి, Dy.CM భట్టిలకు ధన్యవాదాలు తెలిపారు. ANR అవార్డు పొందిన జయసుధకు, NTR అవార్డు గ్రహీత చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న తన కుమారుడు నాగచైతన్యను ‘దుల్ల కొట్టావ్ నాన్న’ అంటూ ప్రత్యేకంగా ప్రశంసించారు.
News March 7, 2026
హెలికాప్టర్‌లో పొగలు.. యూపీ Dy.CMకు తప్పిన ప్రమాదం

యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్యాబిన్‌లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. పైలట్ అప్రమత్తమై వెంటనే లక్నోలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో మౌర్యతో సహా ఐదుగురు హెలికాప్టర్‌లో ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


