News August 5, 2024
ఏపీ వర్చువల్ వర్కింగ్ హబ్‌గా మారాలి: సీఎం చంద్రబాబు
AP: రాష్ట్రం వర్చువల్ వర్కింగ్ హబ్‌గా మారాలన్నదే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం ఓ విధానాన్ని రూపొందించాలని, దీనిపై ఓ వర్క్ షాప్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. ‘విద్యార్థులకు గ్లోబల్ స్థాయి ఉద్యోగాలు వచ్చేలా నైపుణ్యాలను పెంచాలి. గతంలో న్యాక్ అక్రిడేషన్‌లో ఏపీ వర్సిటీలు టాప్-10లో ఉండేవి. ఇప్పుడు ఒక్కటి కూడా లేకపోవడం శోచనీయం’ అని కలెక్టర్లతో మీటింగ్‌లో వ్యాఖ్యానించారు.
Similar News
News December 1, 2024
CM రేవంత్‌కు మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి సవాల్
TG: మాజీ సీఎం KCRకు వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఉందని CM రేవంత్ చేసిన వ్యాఖ్యలను BRS మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఖండించారు. KCRకు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఉన్నట్లు తేలితే తాను MLA పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఒకవేళ నిరూపించలేకపోతే రేవంత్‌రెడ్డి ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. తనతో వస్తే KCR ఫామ్‌హౌస్ చూపిస్తానని రేవంత్‌కు ప్రశాంత్‌రెడ్డి ఆఫర్ చేశారు.
News December 1, 2024
ALERT.. కాసేపట్లో వర్షం
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 గంటల్లో మోస్తరు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, ఖమ్మం, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో చిరుజల్లులు కురిసిన సంగతి తెలిసిందే.
News December 1, 2024
రూ.10 కోసం పోలీసులకు ఫిర్యాదు!
రూ.10 బాకీ పడిన మనిషి ఆ మొత్తాన్ని ఇవ్వడం లేదని ఓ వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించిన ఆసక్తికర ఘటన ఇది. UPలోని హర్దోయ్ ప్రాంతానికి చెందిన జితేంద్ర పాన్ షాప్ నడుపుకుంటున్నారు. సంజయ్ అనే కస్టమర్ ఏడాదిన్నర క్రితం గుట్కా ప్యాకెట్ కొని రూ.10 అరువు పెట్టాడు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదని విసిగిపోయిన జితేంద్ర, పోలీస్ హెల్ప్‌లైన్ 112కి ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి సంజయ్ నుంచి రూ.10ని జితేంద్రకి ఇప్పించారు.