News August 5, 2024

క్వార్ట‌ర్ ఫైనల్స్‌కు చేరిన నిషా దహియా

image

పారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళా రెజ్లర్ నిషా దహియా క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించారు. ఉమెన్స్ ఫ్రీస్టైల్ 68కిలోల విభాగం 16వ రౌండ్‌లో ఉక్రెయిన్‌కు చెందిన టెటియానా రిజ్కోను 6-4 తేడాతో ఓడించారు. మరోవైపు షూటింగ్ స్కీట్ మిక్స్‌డ్ ఈవెంట్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో భారత్ త్రుటిలో పతకం కోల్పోయింది. మహేశ్వరి-అనంత్‌జీత్ జోడీ చైనా చేతిలో 43-44 తేడాతో ఓటమిపాలైంది.
<<-se>>#Olympics2024<<>>

Similar News

News January 15, 2025

‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. నిర్మాత ఆవేదన

image

‘గేమ్ ఛేంజర్’ రిలీజైన నాలుగైదు రోజుల్లోనే బస్సుల్లో, కేబుల్ ఛానల్స్‌లో ప్రసారమవడం ఆందోళన కలిగిస్తోందని నిర్మాత SKN ట్వీట్ చేశారు. ‘సినిమా అంటే కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతలే కాదు. ఇది 3-4 ఏళ్ల కృషి, అంకితభావం, వేలాది మంది కలల ఫలితం. ఇవి చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ముప్పు. ప్రభుత్వాలు దీనికి ముగింపు పలికేలా కఠిన చర్యలు తీసుకోవాలి. సినిమాను బతికించుకునేందుకు ఏకమవుదాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

News January 15, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ డే కలెక్షన్స్

image

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.45కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. వెంకటేశ్‌కు ఇవే ఆల్ టైమ్ కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అని తెలిపింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా, భీమ్స్ సంగీతం అందించారు. నిన్న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.

News January 15, 2025

యుద్ధ నౌకలు జాతికి అంకితం

image

భారత నేవీ అమ్ములపొదిలో మూడు అత్యాధునిక యుద్ధ నౌకలు చేరాయి. INS సూరత్, INS నీలగిరి యుద్ధ నౌకలు, వాఘ్‌షీర్ జలాంతర్గామి(సబ్ మెరైన్)ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ముంబై డాక్ యార్డులో ఈ కార్యక్రమం జరిగింది. రక్షణరంగంలో మేకిన్ ఇండియా ఆవిష్కృతమవుతోందని మోదీ అన్నారు. ప్రపంచంలో భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోందని చెప్పారు.