News August 5, 2024
క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన నిషా దహియా
పారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళా రెజ్లర్ నిషా దహియా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు. ఉమెన్స్ ఫ్రీస్టైల్ 68కిలోల విభాగం 16వ రౌండ్‌లో ఉక్రెయిన్‌కు చెందిన టెటియానా రిజ్కోను 6-4 తేడాతో ఓడించారు. మరోవైపు షూటింగ్ స్కీట్ మిక్స్‌డ్ ఈవెంట్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో భారత్ త్రుటిలో పతకం కోల్పోయింది. మహేశ్వరి-అనంత్‌జీత్ జోడీ చైనా చేతిలో 43-44 తేడాతో ఓటమిపాలైంది.
<<-se>>#Olympics2024<<>>
Similar News
News September 12, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: రాష్ట్రంలో వర్షాలు దాదాపు తగ్గుముఖం పట్టాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
News September 12, 2024
చైనాలో మరో ప్రాణాంతక వైరస్ విజృంభణ
కరోనా పుట్టిన చైనాలో మరో ప్రాణాంతక వైరస్ విస్తరిస్తోంది. దీన్ని వెట్‌ల్యాండ్ వైరస్ అని పిలుస్తున్నారు. 2019లో దీన్ని తొలిసారి గుర్తించగా, ఇప్పుడు నెలలోనే 17 మందికి సోకింది. జంతువులలో రక్తాన్నీపీల్చే పురుగుల(ఓ రకమైన నల్లులు) ద్వారా మనుషుల్లో వ్యాపిస్తోంది. వారిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, దద్దుర్లు కనిపిస్తాయని, తర్వాత మెదడు, నరాల సంబంధ వ్యాధులకు కారణమవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.
News September 12, 2024
చరిత్ర సృష్టించేందుకు 58 రన్స్ దూరంలో కోహ్లీ
క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుకు సమీపంలో ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు అంతర్జాతీయంగా 591 ఇన్నింగ్స్‌లో 26,952 పరుగులు చేశారు. మరో 58 పరుగులు చేస్తే అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 27వేల పరుగుల్ని చేరుకున్న తొలి ఆటగాడిగా నిలుస్తారు. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్(623 ఇన్నింగ్స్) పేరిట ఆ రికార్డు ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో సచిన్, పాంటింగ్, సంగక్కర మాత్రమే 27వేలకు పైగా రన్స్ చేశారు.