News August 5, 2024
మహిళల T20 వరల్డ్ కప్‌పై నీలినీడలు!

బంగ్లాదేశ్‌లో ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా తప్పుకోవడం, సైనిక పాలనతో ఆ దేశంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో అక్టోబర్ నుంచి ఆ దేశంలో జరగాల్సిన మహిళల టీ20 వరల్డ్ కప్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ టోర్నీని వేరే దేశానికి తరలించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా వరల్డ్ కప్ విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 9, 2025
కేసీఆర్ తెచ్చిన ఏ పథకాన్నీ రద్దు చేయలేదు: CM రేవంత్

TG: KCR తెచ్చిన ఏ పథకాన్నీ తాను రద్దు చేయలేదని, వాటికి అదనంగా మరిన్ని స్కీమ్స్ అమలు చేస్తున్నట్లు CM రేవంత్ తెలిపారు. నాడు అభివృద్ధిని పక్కనపెట్టి ఎలాంటి ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం, ప్రగతిభవన్ మాత్రమే నిర్మించారని విమర్శించారు. ‘నేను SC వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రంగా నిలిపాను. కులగణన చేసి చూపించా. రాష్ట్ర గీతాన్ని అందించా. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించా’ అని రేవంత్ వివరించారు.
News November 9, 2025
మల్లె మొగ్గలను తొలిచే పురుగుల నివారణ ఎలా?

మల్లె తోటల్లో మొగ్గలను తొలిచి తినే పురుగు వల్ల పంటకు తీవ్ర నష్టం కలుగుతుంది. దీని నివారణకు 5 శాతం వేప కాషాయం లేదా థయోక్లోప్రిడ్ 21.7% S.C. 1ml లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 18.5% S.C 0.3ml లేదా స్పైనోశాడ్ 45% ఎస్.సి. 0.3మి.లీ. లేదా క్వినాల్ ఫాస్ 25% ఇ.సి. 2మి.లీ.లలో ఏదైనా ఒకదానిని లీటరు నీటికి కలుపుకొని మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. ఎకరానికి 6 నుంచి 8 చొప్పున లింగాకర్షణ బుట్టలు అమర్చాలి.
News November 9, 2025
ప్రభుత్వాన్ని మార్చడం వల్ల ఇబ్బందులొస్తాయి: లోకేశ్

బిహార్ అభివృద్ధి కోసం NDAను మరోసారి గెలిపించాలని మంత్రి లోకేశ్ ఓటర్లను కోరారు. పట్నాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని మార్చడం వల్ల ఇబ్బందులొస్తాయని, అభివృద్ధి ఆగిపోతుందని చెప్పారు. గతంలో APలో ఒక్క ఛాన్స్ పేరుతో ఓ పార్టీ అధికారంలోకి రాగానే పరిశ్రమలన్నీ పారిపోయాయని తెలిపారు. ఏపీలో జరిగిన దాన్ని దృష్టిలో ఉంచుకుని బిహార్ యువత మేల్కోవాలని పిలుపునిచ్చారు.


