News August 5, 2024
మహిళల T20 వరల్డ్ కప్‌పై నీలినీడలు!

బంగ్లాదేశ్‌లో ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా తప్పుకోవడం, సైనిక పాలనతో ఆ దేశంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో అక్టోబర్ నుంచి ఆ దేశంలో జరగాల్సిన మహిళల టీ20 వరల్డ్ కప్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ టోర్నీని వేరే దేశానికి తరలించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా వరల్డ్ కప్ విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 19, 2026
KKR జట్టులో చేరిన స్టార్ బౌలర్

IPL: KKR జట్టులో స్టార్ బౌలర్ మతీశ పతిరణ జాయిన్ అయ్యారు. శ్రీలంక క్రికెట్ బోర్డ్ NOC ఇవ్వడంతో ఆయన తాజాగా తమ క్యాంపులోకి ఎంట్రీ ఇచ్చినట్లు KKR యాజమాన్యం ప్రకటించింది. డెత్ ఓవర్లలో యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే ఈ బౌలర్ రాకతో అయినా KKR ఫేట్ మారుతుందేమో చూడాలి. అయితే ఇవాళ RRతో జరిగే మ్యాచులో అతను ఆడతారా? లేదా? అనేది క్లారిటీ లేదు. ఈ సీజన్‌లో KKR ఆడిన 5 మ్యాచుల్లోనూ ఓడగా ఒకటి రద్దయింది.
News April 19, 2026
చిన్న పొరపాటు చేసినా తీవ్రస్థాయిలో దాడి: ఇరాన్

అమెరికాతో దౌత్యానికైనా, పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఘేర్ స్పష్టం చేశారు. తాము యుద్ధంలో గెలిచేశామని, ఇప్పుడు చర్చలకు రెడీగా ఉన్నామని తెలిపారు. ఈ సమయంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా, చిన్న పొరపాటు చేసినా తీవ్ర స్థాయిలో బదులిస్తామన్నారు. గత సంఘర్షణలతో పోలిస్తే ఇరాన్ సామర్థ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయని చెప్పారు.
News April 19, 2026
మరోసారి తల్లి కాబోతోన్న దీపికా పదుకొణె

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తల్లి కాబోతున్నారు. తాను ప్రెగ్నెంట్ అని ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. తన కూతురు దువా చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పట్టుకున్న ఫొటోను షేర్ చేశారు. రణ్‌వీర్ సింగ్, దీపిక 2018లో వివాహం చేసుకోగా, 2024లో కూతురు జన్మించిన సంగతి తెలిసిందే.


