News August 6, 2024
సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై చర్యలకు ఆదేశాలు

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ అందలేదని, సొంతంగా ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న కాలేజీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని వర్సిటీ రిజిస్ట్రార్‌లను ఉన్నత విద్యామండలి ఆదేశించింది. ఈ మేరకు పలు యూనివర్సిటీలకు లేఖ రాసింది. సర్టిఫికెట్లు అందకపోవడంతో ఉన్నత విద్య కోర్సుల్లో, ఉద్యోగాల్లో చేరేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది.
Similar News
News March 27, 2026
దేశంలో లాక్‌డౌన్ వార్తలు.. కేంద్రం ఏమందంటే?

దేశంలో ఇంధన కొరత నేపథ్యంలో లాక్‌డౌన్ తప్పదన్న ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖండించారు. అది పూర్తిగా అసత్య ప్రచారం అని ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర అలాంటి ప్రతిపాదనేమీ లేదని స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐకమత్యంగా ఉండటం ఎంతో ముఖ్యమన్నారు. సంక్షోభాలను ఎదుర్కొనేందుకు తాము పూర్తిగా సన్నద్ధమై ఉన్నామని పేర్కొన్నారు.
News March 27, 2026
రేపే ఐపీఎల్.. RCBకి కీలక బౌలర్ దూరం!

రేపు ఐపీఎల్ ప్రారంభం కానుండగా RCBకి కీలక బౌలర్ నువాన్ తుషారా దూరమైనట్లు తెలుస్తోంది. ఆయనకు NOC ఇవ్వడానికి శ్రీలంక క్రికెట్ బోర్డు నిరాకరించినట్లు సమాచారం. నువాన్‌కు గాయం లేనప్పటికీ ఫిట్‌నెస్ లేదనే కారణంతో IPLలో పాల్గొనడానికి తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఫిట్‌నెస్ అంశాన్ని ఏళ్లుగా నిర్లక్ష్యం చేసి IPL ముందు కఠిన రూల్స్ అమలు చేయడాన్ని శ్రీలంక మాజీ క్రికెటర్ చమిందా వాస్ తప్పుపట్టారు.
News March 27, 2026
ఆయిల్ కంపెనీల నష్టాలను తగ్గించేందుకు పన్నులపై కోత: హర్దీప్‌సింగ్

క్రూడాయిల్ ధరలు నెల వ్యవధిలో బ్యారెల్ $70 నుంచి $122 వరకు పెరిగాయని కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ వెల్లడించారు. దీనివల్ల పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు 20-50% పెరిగాయని తెలిపారు. అయితే PM మోదీ సామాన్యులపై భారం వేయకూడదని నిర్ణయించారన్నారు. ఆయిల్ కంపెనీలకు లీటర్ పెట్రోల్‌పై రూ.24, డీజిల్‌పై రూ.30 మేర వస్తున్న నష్టాన్ని <<19487934>>తగ్గించేందుకు<<>> ప్రభుత్వ పన్నులపై కోత విధించినట్లు Xలో పేర్కొన్నారు.


