News August 6, 2024
సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై చర్యలకు ఆదేశాలు

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ అందలేదని, సొంతంగా ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న కాలేజీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని వర్సిటీ రిజిస్ట్రార్‌లను ఉన్నత విద్యామండలి ఆదేశించింది. ఈ మేరకు పలు యూనివర్సిటీలకు లేఖ రాసింది. సర్టిఫికెట్లు అందకపోవడంతో ఉన్నత విద్య కోర్సుల్లో, ఉద్యోగాల్లో చేరేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది.
Similar News
News January 25, 2026
థాంక్యూ ఇండియా: ఇరాన్

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC)లో తమకు అండగా నిలిచినందుకు ఇండియాకు ఇరాన్ థాంక్స్ చెప్పింది. ‘మాకు మద్దతు ఇచ్చినందుకు ఇండియాకు కృతజ్ఞతలు. న్యాయం, జాతీయ సార్వభౌమత్వం విషయంలో ఆ దేశ వైఖరికి ఇది నిదర్శనం’ అని ఇరాన్ రాయబారి మహ్మద్ ఫథాలీ అన్నారు. కాగా శాంతియుత నిరసనలను ఇరాన్ ప్రభుత్వం అణచేస్తోందంటూ UNHRC 39వ ప్రత్యేక సెషన్‌లో ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది.
News January 25, 2026
వేరుశనగలో ఇనుపధాతులోపం.. నివారణ

ఆకులలో పత్రహరితం తయారవడానికి ఇనుపధాతువు కీలకం. ఇది లోపించినప్పుడు వేరుశనగ మొక్క ఆకులు పసుపు రంగుకు మారతాయి. క్రమంగా ఆకు కొనలు ఎండిపోతాయి. మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. ఈ సమస్య నివారణకు 0.5 శాతంఅన్నబేధి(5గ్రా. లీటరు నీటికి), 0.1 శాతం నిమ్మఉప్పు(లీటరు నీటికి 1గ్రాము) కలిపిన ద్రావణాన్ని 4-5 రోజుల వ్యవధిలో 2-3సార్లు పిచికారీ చేసుకోవాలి.
News January 25, 2026
కెనడాపై 100% టారిఫ్స్ విధిస్తా: ట్రంప్

చైనాతో ట్రేడ్ డీల్‌పై ముందుకు వెళ్తే కెనడాపై చర్యలు తప్పవని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఆ దేశాన్ని సజీవంగా చైనా మింగేస్తుంది. వారి వ్యాపారాలు, సామాజిక నిర్మాణం, జీవన విధానాన్ని నాశనం చేస్తుంది. చైనా ఉత్పత్తులను అమెరికాకు పంపేందుకు కెనడాను డ్రాప్ ఆఫ్ పోర్టుగా ఉపయోగించాలనుకుంటే వాళ్లు పొరపాటు పడినట్లే. డీల్ చేసుకున్న మరుక్షణమే కెనడాపై 100% టారిఫ్స్ విధిస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు.


