News August 6, 2024
యూనస్ అంగీకరించారు: బంగ్లా మీడియా

బంగ్లాలో ఏర్పాటయ్యే మధ్యంతర ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉండేందుకు ప్రముఖ సామాజికవేత్త మహమ్మద్ యూనస్ అంగీకరించినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. బంగ్లాలో మహిళలను పేదరికం నుంచి బయటపడేసేందుకు యూనస్ గ్రామీణ బ్యాంకు ద్వారా చేసిన కృషికి గుర్తింపుగా 2006లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఈయన అమెరికాకు అనుకూలుడనే ముద్ర ఉంది.
Similar News
News March 25, 2026
అప్పుడు IPL క్రికెటర్.. ఇప్పుడు RCBకి ఛైర్మన్

IPL ఫ్రాంచైజీ RCBని ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్షియం <<19468471>>కొనుగోలు<<>> చేసిన సంగతి తెలిసిందే. RCB కొత్త ఛైర్మన్‌గా కుమార మంగళం బిర్లా కుమారుడు ఆర్యమాన్ బిర్లా ఎంపికయ్యారు. ఆయన దేశవాళీ క్రికెట్‌లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించారు. 2018, 2019లో IPLలో RR జట్టు సభ్యుడిగా ఉన్నారు. కానీ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. మానసిక ఆరోగ్య కారణాలతో 2019 చివర్లో ఆయన క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు.
News March 25, 2026
ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితి పెంచాలి: నిరుద్యోగ జేఏసీ

AP: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠ వయో పరిమితిని 42 నుంచి 46 ఏళ్లకు పెంచాలని రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ షేక్ సిద్ధిక్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో మ్యాగ్జిమమ్ ఏజ్ లిమిట్ 46 ఏళ్లుగా ఉందని, ఇక్కడ కూడా 46కి పెంచాలని కోరారు. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
News March 25, 2026
రష్యా, ఇరాన్‌కు ఇజ్రాయెల్ షాక్

ఇరాన్‌కు అన్ని వనరులు కట్ చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇటీవల ఇరాన్-రష్యా మధ్య ఆయుధాల సరఫరాకు కీలకమైన కాస్పియన్ సముద్రం మార్గాన్ని టార్గెట్ చేసింది. ఇరాన్ నేవీ, మౌలికవసతులు ధ్వంసమయ్యేలా బందర్ అన్జాలీ పోర్టుపై దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఇరాన్ – రష్యాల మధ్య మిసైల్స్, డ్రోన్లు, గన్స్ మొదలైనవి సరఫరా కావడానికి ఈ పోర్టు కీలకం. ఈ దాడితో ఇరు దేశాలకు ఇజ్రాయెల్ భారీ నష్టం కలిగించింది.


