News August 6, 2024

యూన‌స్ అంగీకరించారు: బంగ్లా మీడియా

image

బంగ్లాలో ఏర్పాటయ్యే మ‌ధ్యంతర ప్ర‌భుత్వానికి ప్రధాన స‌ల‌హాదారుగా ఉండేందుకు ప్ర‌ముఖ సామాజిక‌వేత్త మ‌హ‌మ్మ‌ద్ యూన‌స్ అంగీక‌రించిన‌ట్టు ఆ దేశ మీడియా తెలిపింది. బంగ్లాలో మ‌హిళ‌ల‌ను పేద‌రికం నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు యూన‌స్ గ్రామీణ బ్యాంకు ద్వారా చేసిన కృషికి గుర్తింపుగా 2006లో ఆయనకు నోబెల్ శాంతి బ‌హుమ‌తి దక్కింది. ఈయ‌న అమెరికాకు అనుకూలుడనే ముద్ర ఉంది.

Similar News

News January 25, 2026

పశువుల్లో పాల ఉత్పత్తిని మరింత పెంచే గడ్డి

image

పశువుల్లో పాల ఉత్పత్తి పెరిగేందుకు చాలా మంది పాడి రైతులు సూపర్ నేపియర్ పశుగ్రాసం వాడుతున్నారు. ఇప్పుడు దీన్ని మించి అధిక ప్రొటీన్ శాతం కలిగి, పాల దిగుబడిని మరింత పెంచే ‘4G బుల్లెట్ సూపర్ నేపియర్’ పశుగ్రాసం అందుబాటులోకి వచ్చింది. నేపియర్‌తో పోలిస్తే ఇది చాలా మృదువుగా, 10-13 అడుగుల ఎత్తు పెరిగి, ఎకరాకు 200 టన్నుల దిగుబడినిస్తుంది. దీన్ని ఎలా సాగు చేయాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

News January 25, 2026

JNCASRలో ఉద్యోగాలు

image

జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్(<>JNCASR<<>>) 7 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, బీకామ్, బీఈ/బీటెక్, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 5 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ/DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.jncasr.ac.in

News January 25, 2026

సూర్యుడి రథం మనకు బోధించే పాఠాలివే..

image

సూర్యుని రథానికి ఒకే చక్రం ఉంటుంది. అది ఏడాది కాలానికి సంకేతం. ఆ చక్రానికి ఉన్న 6 ఆకులు 6 రుతువులను సూచిస్తాయి. రథానికి కట్టిన 7 గుర్రాలు సూర్యకాంతిలోని 7 రంగులను(VIBGYOR) సూచిస్తాయి. అలాగే మన శరీరమే ఒక రథంగా చెప్పవచ్చు. బుద్ధిని సారథిగా భావించవచ్చు. మనస్సును పగ్గాలుగా పరిగణించవచ్చు. ఈ రథాన్ని నడిపించే ఆత్మ స్వరూపం సూర్యుడు. నిరంతరం ముందుకు సాగడమే సూర్యుని గుణం. అది మన జీవన ప్రయాణానికి స్పూర్తి.