News August 6, 2024
హసీనాను పదవి నుంచి దింపిన 26 ఏళ్ల కుర్రాడు!

బంగ్లాదేశ్‌లో నహీద్ ఇస్లామ్ అనే యువకుడు పీఎం షేక్ హసీనా పదవి కోల్పోయేటట్లు చేశాడు. తోటి ఉద్యమకారులతో కలిసి ఆయన రిజర్వేషన్లపై పోరాడాడు. బంగ్లాదేశ్ జాతీయ జెండాను నుదిటికి కప్పుకుని ఉద్యమాల్లో పాల్గొనేవాడు. భారీ ఆందోళనలు నిర్వహించి ప్రజల దృష్టిని ఆకర్షించాడు. కాగా 26 ఏళ్ల నహీద్ ఢాకాలో జన్మించాడు. ఢాకా యూనివర్సిటీలో సోషియాలజీ విద్యార్థి. ఆయన తండ్రి ఓ టీచర్. ఆయన తమ్ముడు నఖీబ్ కూడా ఉద్యమకారుడే.
Similar News
News April 3, 2026
‘దశరథ గడ్డి’ని ఎలా సాగు చేయాలి?

దశరథ గడ్డి(హెడ్జ్ లూసర్న్) పాడి పశువులకు, జీవాలకు మేలు చేసే బహువార్షిక పప్పుధాన్యపు గడ్డి. ఇందులో మాంసకృత్తులు, ప్రొటీన్లు, ఫైబర్, లిగ్నిన్ తదితర పోషకాలు అధికంగా ఉంటాయి. దీన్ని ఏడాది పొడవునా సాగుచేయవచ్చు. ఎకరాలో సాగుకు 10kgల విత్తనాలు సరిపోతాయి. కేజీ విత్తనానికి కేజీ ఇసుకను కలిపి వేయాలి. నీరు నిల్వ ఉండే నేలలు, చౌడు నేలలు దశరథ గడ్డి సాగుకు పనికిరావు. ఒక హెక్టారుకు 90-100 టన్నుల పశుగ్రాసం వస్తుంది.
News April 3, 2026
పాడి పశువులకు ‘దశరథ గడ్డి’తో కలిగే లాభాలివే

☛ దశరథ గడ్డిని ఆవులు, గేదెలకు ప్రతిరోజూ 2 కేజీల చొప్పున ఇస్తే పాల దిగుబడి, వెన్నశాతం వృద్ధి చెందుతుంది.
☛ మేకలు, గొర్రెలకు దాణా బదులుగా 50 శాతం ఈ గడ్డిని ఆహారంగా ఇస్తే వాటి పెరుగుదల బాగుంటుంది.
☛ లేయర్ (ఆడ) కోడిపిల్లలకు ఆహారంలో 6 శాతం ఈ గడ్డిని ముక్కలు చేసి వేస్తే గుడ్ల నాణ్యత పెరుగుతుంది.
☛ కుందేళ్లు, పందులకు ఈ గడ్డిని అందిస్తే వాటి పెరుగుదల వేగంగా ఉంటుంది.
News April 3, 2026
వారికి నాపై జెలసీ ఉండొచ్చు: రహానే

IPL: KKR వరుసగా 2 ఓటముల నేపథ్యంలో కెప్టెన్సీపై, నిన్న SRH మ్యాచులో తక్కువ పరుగుల(8)కే ఔట్ అవ్వడంపై వచ్చిన విమర్శల పట్ల రహానే స్పందించారు. ‘2023 నుంచి లీగ్‌లో బెస్ట్ స్ట్రైక్‌రేట్స్ మెయింటెన్ చేస్తున్నా. విమర్శలు చేసేవాళ్లు నా ఆటను చూడలేదేమో. అలాగే వారికి నాపై వ్యతిరేక అజెండా ఉండొచ్చు. వాళ్లకి నేను ఆడటం ఇష్టం లేదనుకుంటా. నాకొచ్చిన సక్సెస్ చూసి వారికి జెలసీ ఉండొచ్చు’ అని కౌంటర్ స్పందించారు.


