News August 7, 2024

రోహిత్‌కు 37 ఏళ్లు.. అయితేనేం!

image

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 37 ఏళ్లు దాటారని, ఆయనకు ఫిట్‌నెస్‌ లేదని కొందరు విమర్శలు చేస్తుంటారు. అయితే, ఇప్పటికీ తన బ్యాటింగ్ శైలిలో ఎలాంటి మార్పులేదని హిట్ మ్యాన్ నిరూపిస్తున్నారు. ODIల్లో 118.43 స్ట్రైక్ రేట్‌తో అదరగొడుతున్నారు. ఆయన తర్వాత 35 ఏళ్ల తర్వాత బౌలర్లకు చుక్కలు చూపించిన వారిలో క్రిస్ గెయిల్ (108.65SR), డేవిడ్ వార్నర్ (104.23), గిల్‌క్రిస్ట్(101.29), టెండూల్కర్ (93.60SR) ఉన్నారు.

Similar News

News January 16, 2025

J&Kలో మిస్టరీ: నెలన్నరలో ఒకే ఊరిలో 15 మంది మృతి

image

J&K రాజౌరీ(D)లోని బుధాల్‌లో మిస్టరీ మరణాలు కలవరపెడుతున్నాయి. నెలన్నరలోనే 15 మంది చనిపోవడంతో ప్రభుత్వం SITను ఏర్పాటుచేసింది. DEC 7న విందు ఆరగించిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, DEC 12న మరో సహపంక్తి భోజనం చేసిన వారిలో ముగ్గురు, JAN 12న మరొకరు మృతిచెందారు. ఇలా పలు ఘటనల్లో 15 మంది చనిపోయారు. ఆహార, నీటి నమూనాల్లో విష పదార్థాలు ఉండటంతో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

News January 16, 2025

క్రెడిట్ కార్డు యూజర్లకు పోలీసుల సూచనలు

image

క్రెడిట్ కార్డు యూజర్లను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడను ఎంచుకున్నారు. క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లపై బంపర్ ఆఫర్ అంటూ మెసేజ్‌లు పంపుతున్నారు. అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని, బ్యాంకుల పేరిట వచ్చే మెసేజ్‌లను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని TG పోలీసులు సూచించారు. రివార్డు పాయింట్ల కోసం APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయొద్దన్నారు. అత్యాశకు వెళ్తే అకౌంట్ ఖాళీ అవుతుందని హెచ్చరించారు.

News January 16, 2025

BREAKING: భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోలు మృతి

image

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. బీజాపూర్, సుకుమా, దంతెవాడ జిల్లాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మావోలు ఎదురుపడ్డారు. దీంతో మధ్యాహ్నం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇటీవల మావోలు మందుపాతర పేల్చడంతో ఎనిమిది మంది పోలీసులు చనిపోయిన విషయం తెలిసిందే.