News January 16, 2025

BREAKING: భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోలు మృతి

image

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. బీజాపూర్, సుకుమా, దంతెవాడ జిల్లాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మావోలు ఎదురుపడ్డారు. దీంతో మధ్యాహ్నం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇటీవల మావోలు మందుపాతర పేల్చడంతో ఎనిమిది మంది పోలీసులు చనిపోయిన విషయం తెలిసిందే.

Similar News

News February 18, 2025

మార్చి 28నే ‘హరిహర వీరమల్లు’: నిర్మాత

image

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ మూవీని మార్చి 28నే రిలీజ్ చేస్తామని నిర్మాత ఏఎం రత్నం ప్రకటించారు. ఆ దిశగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. పవన్‌కు సంబంధించిన మిగిలిన షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. ఈ చిత్రం నుంచి ఈ నెల 24న రొమాంటిక్ సాంగ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

News February 18, 2025

ప్రజాస్వామ్యంపై జగన్ లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది: లోకేశ్

image

AP: అధికారం ఉన్నప్పుడు చట్టాలను తుంగలో తొక్కి… ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ జగన్ లెక్చర్ ఇవ్వడం వింతగా ఉందని మంత్రి లోకేశ్ అన్నారు. 100 మందికి పైగా వైసీపీ రౌడీలు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం కోట్లాది మంది కళ్లారా చూశారని చెప్పారు. పచ్చి అబద్ధాలను కాన్ఫిడెంట్‌గా చెప్పడంలో జగన్ PhD చేసినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు జగన్ బ్రాండ్ అని ఫైరయ్యారు.

News February 18, 2025

పరీక్ష లేకుండా 21,413 ఉద్యోగాలు

image

దేశవ్యాప్తంగా 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. APలో 1,215, TGలో 519 ఖాళీలు ఉన్నాయి. ఎలాంటి పరీక్ష లేకుండా టెన్త్ మార్కుల మెరిట్ లిస్ట్ ఆధారంగా నియామకాలు చేపడతారు. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ శాలరీ నెలకు రూ.12,000-రూ.29,380, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జీతం రూ.10,000-రూ.24,470 వరకు ఉంటుంది. చివరి తేదీ: మార్చి 3. indiapostgdsonline.gov.in

error: Content is protected !!