News August 7, 2024

రాష్ట్రంలోనే తొలిసారిగా విద్యార్థినులకు ‘నెలసరి’ సెలవు

image

AP: రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థినులకు నెలలో ఒక రోజు నెలసరి సెలవును ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థినులు మెయిల్ ద్వారా ఈ లీవ్ తీసుకోవచ్చు. ఈ విషయమై గత ఏడాది విద్యార్థినులు రిజిస్ట్రార్‌కు ప్రతిపాదన చేయగా జనవరిలో ఆమోదం తెలిపారు. ఇప్పటికే దేశంలోని 7 యూనివర్సిటీల్లో ఈ సెలవు విధానం అమల్లో ఉంది.

Similar News

News July 5, 2025

ఉత్కంఠ మ్యాచ్.. భారత్ ఓటమి

image

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత మహిళల జట్టు ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 9 వికెట్లు కోల్పోయి 171 రన్స్ చేసింది. ఓపెనర్లు సోఫియా 75, వ్యాట్ 66 రన్స్‌తో రాణించారు. ఛేదనలో భారత ఓపెనర్లు మంధాన 56, షఫాలీ 47 రన్స్ చేసి అద్భుత ఆరంభాన్నిచ్చినా చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో 5 రన్స్‌ తేడాతో ఓడిపోయింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి 2 గేమ్స్ గెలిచిన టీమ్ ఇండియా 2-1తో లీడ్‌లో ఉంది.

News July 5, 2025

ప్రపంచ టెస్టు క్రికెట్‌లో 10,000వ డకౌట్

image

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఇంగ్లండ్ ఆటగాడు కార్స్ డకౌట్ ప్రపంచ టెస్టు క్రికెట్‌లో 10,000వ డకౌట్‌గా నిలిచింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఆయన LBWగా వెనుదిరిగారు. 1877లో ఎడ్వర్డ్ గ్రెగరీ తొలిసారి డకౌట్ అయిన ప్లేయర్‌గా ఉన్నారు. 10,000 డకౌట్లు కావడానికి దాదాపు శతాబ్దంన్నర పట్టింది. కాగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఆరుగురు ప్లేయర్లు డకౌట్ కావడం విశేషం.

News July 5, 2025

సూపర్‌యునైటెడ్ ర్యాపిడ్ టైటిల్ నెగ్గిన గుకేశ్

image

గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా క్రోయేషియాలో జరుగుతున్న సూపర్‌యునైటెడ్ ర్యాపిడ్&బ్లిట్జ్ టోర్నీలో వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ ర్యాపిడ్ టైటిల్ నెగ్గారు. ఫైనల్ రౌండ్లో USకు చెందిన వెస్లేపై విజయం సాధించారు. నిన్న ఐదో రౌండ్లో వరల్డ్ No.1 కార్ల్‌సన్‌ను ఓడించిన విషయం తెలిసిందే. కాగా ఇవాళ్టి నుంచి బ్లిట్జ్ ఫార్మాట్ మొదలవనుంది. ర్యాపిడ్, బ్లిట్జ్ 2 ఫార్మాట్లలో ప్రదర్శన ఆధారంగా ఓవరాల్ విన్నర్‌‌ను ప్రకటిస్తారు.