News August 7, 2024

రాష్ట్రంలోనే తొలిసారిగా విద్యార్థినులకు ‘నెలసరి’ సెలవు

image

AP: రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థినులకు నెలలో ఒక రోజు నెలసరి సెలవును ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థినులు మెయిల్ ద్వారా ఈ లీవ్ తీసుకోవచ్చు. ఈ విషయమై గత ఏడాది విద్యార్థినులు రిజిస్ట్రార్‌కు ప్రతిపాదన చేయగా జనవరిలో ఆమోదం తెలిపారు. ఇప్పటికే దేశంలోని 7 యూనివర్సిటీల్లో ఈ సెలవు విధానం అమల్లో ఉంది.

Similar News

News November 8, 2025

మీ కలలను నెరవేర్చలేకపోతున్నా.. NEET విద్యార్థి సూసైడ్

image

వైద్య కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే NEETలో ఫెయిలైనందుకు UPకి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రావత్‌పూర్‌లోని హాస్టల్ గదిలో మహమ్మద్ ఆన్(21) సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ‘అమ్మానాన్న ప్లీజ్ నన్ను క్షమించండి. నేను చాలా ఒత్తిడిలో ఉన్నా. మీ కలలను నెరవేర్చలేకపోతున్నాను. నేను చనిపోతున్నా. దీనికి పూర్తిగా నేనే బాధ్యుడిని’ అని రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

News November 8, 2025

యసీన్ పటేల్ ఊచకోత.. భారత్ ఓటమి

image

హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో కువైట్ చేతిలో భారత్‌ ఓడిపోయింది. తొలుత కువైట్ 6 ఓవర్లలో 106-5 స్కోర్ చేసింది. ఆ జట్టులోని యసీన్ పటేల్ 14 బంతుల్లోనే 58 రన్స్(8 సిక్సర్లు,2 ఫోర్లు) చేశారు. చివరి ఓవర్‌లో వరుసగా 6, 6, 6, 6, 6, 2 బాదారు. తర్వాత భారత్ 5.4 ఓవర్లలో 79 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. ఈ టోర్నీలో ఇరు జట్లు చెరో 6 ఓవర్లు ఆడతాయి. ఒక్కో టీమ్ నుంచి ఆరుగురు మాత్రమే బ్యాటింగ్ చేస్తారు.

News November 8, 2025

న్యూస్ అప్‌డేట్స్ 10@AM

image

* తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న A-16 అజయ్ కుమార్ సుగంధ్‌ అరెస్టు. భోలేబాబా కంపెనీకి కెమికల్స్ ఉన్న పామాయిల్ సప్లై చేసినట్లు గుర్తింపు
*తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన. పలమనేరులో కుంకీ ఏనుగుల క్యాంపును సందర్శించనున్న పవన్
*బిహార్ తొలి దశ పోలింగ్‌లో 65.08% ఓటింగ్ నమోదు: ఈసీ
*ఢిల్లీలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని విమాన సర్వీసులు