News August 7, 2024

వినేశ్ ఫొగట్‌పై అనర్హత.. అప్పీల్ చేసిన భారత్

image

పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడటంతో భారత్ అప్పీల్‌కు వెళ్లింది. ప్రధాని మోదీ సూచనతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష దీనిపై ఈ పిటిషన్ వేశారు. 50 కిలోల విభాగంలో ఉన్న వినేశ్ కేవలం 100 గ్రా. బరువు ఎక్కువగా ఉండటంతో ఆమెపై వేటు పడింది. అటు ఫొగట్‌‌పై అనర్హత వేటు పడటంతో యావత్ భారతావని తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది.

Similar News

News March 5, 2026

ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

image

ఏపీలో పదో తరగతి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. <>https://bse.ap.gov.in/<<>> సైట్ లేదా మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009, లీప్ యాప్‌‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వెబ్‌సైట్ సర్వర్ బిజీగా ఉండటంతో వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.

News March 5, 2026

కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

image

కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో 5 పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 10 ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి BTech/BE (సివిల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు నెలకు రూ.65వేలు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు రూ.55వేలు చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cochinport.gov.in

News March 5, 2026

ఉగాదికి ‘ఉస్తాద్ భగత్‌ సింగ్’

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ముందుగా ప్రకటించినట్లు ఈనెల 26న కాకుండా ఉగాది సందర్భంగా ఈనెల 19న రిలీజ్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. ‘ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత’ అంటూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మూవీలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.