News August 7, 2024
వినేశ్ ఫొగట్‌పై అనర్హత.. అప్పీల్ చేసిన భారత్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడటంతో భారత్ అప్పీల్‌కు వెళ్లింది. ప్రధాని మోదీ సూచనతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష దీనిపై ఈ పిటిషన్ వేశారు. 50 కిలోల విభాగంలో ఉన్న వినేశ్ కేవలం 100 గ్రా. బరువు ఎక్కువగా ఉండటంతో ఆమెపై వేటు పడింది. అటు ఫొగట్‌పై అనర్హత వేటు పడటంతో యావత్ భారతావని తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది.
Similar News
News September 10, 2024
సముద్రపు నీరు ఎందుకు ఉప్పగా ఉంటుంది?
సముద్రాల్లోని నీరు సూర్యుడి వేడికి ఆవిరై మేఘాలుగా వర్షించి నదుల్లోకి చేరుతుంది. ఆ నది సముద్రంలోకి వచ్చే క్రమంలో అనేక ప్రదేశాల్లో ప్రవహిస్తూ ఆయా ప్రాంతాల లవణాలను తనలో కలుపుకొంటూ సముద్రంలో చేరుతుంది. నీటి గాఢత తక్కువగా ఉండటంతో నదుల్లో నీరు ఉప్పగా అనిపించదు. కానీ సాగరాల్లో లవణాలు ఎటూ పోయే దారి ఉండదు. అటు సముద్రాల అడుగున భూమి పొరల నుంచి కూడా లవణాలు అందులో కలుస్తుండటంతో ఆ నీరు ఉప్పగా ఉంటుంది.
News September 10, 2024
టాటా మోటార్స్ బంపరాఫర్
పండుగల సీజన్ సందర్భంగా టాటా మోటార్స్ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. పాపులర్ కార్లు, SUVలపై రూ.2.05 లక్షల వరకూ ధరలు తగ్గించింది. ఈ ఆఫర్లు అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయి. అలాగే డీలర్ వద్ద ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.45వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. అన్ని రకాల పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వేరియంట్ కార్లపైనా ధరల తగ్గింపు ఉంటుందని టాటా మోటార్స్ తెలిపింది.
News September 10, 2024
సైన్యం వద్దంటున్నా బైడెన్ వినలేదు: నివేదిక
అఫ్గానిస్థాన్ నుంచి బలగాల ఉపసంహరణ వద్దని అమెరికా మిలిటరీ, అఫ్గాన్ ప్రభుత్వం, నాటో సూచిస్తున్నా దేశాధ్యక్షుడు బైడెన్ లెక్కచేయలేదని US విదేశీ వ్యవహారాల కమిటీ నివేదిక వెల్లడించింది. ‘నిపుణులు, సలహాదారుల సూచనలన్నింటినీ బైడెన్ పెడచెవిన పెట్టారు. దేశ ప్రయోజనాల కంటే తన వ్యక్తిగత ప్రతిష్ఠే ముఖ్యమనుకున్నారు. తన నిర్ణయానికి ప్రజల మద్దతు కూడగట్టేందుకు అనేక అబద్ధాల్ని చెప్పుకొచ్చారు’ అని నివేదిక తెలిపింది.