News August 7, 2024

పీకల్లోతు కష్టాల్లో భారత్

image

శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 249 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన IND 82 రన్స్‌కే 6 కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్ 35, కోహ్లీ 20, శ్రేయస్ 8, గిల్ 6, పంత్ 6, అక్షర్ 2 పరుగులకే వెనుదిరిగారు. క్రీజులో పరాగ్, దూబే ఉన్నారు. 3 వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ టై కాగా రెండో వన్డేలో లంక విజయం సాధించింది. సిరీస్ సమం కావాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పక నెగ్గాలి.

Similar News

News March 13, 2026

విద్యార్థులూ.. ట్రిపుల్ ఐటీ ఎదురుచూస్తోంది!

image

TG: 2026-27కు సంబంధించి బాసర, మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల షెడ్యూల్‌ను ఆర్జీయూకేటీ వీసీ గోవర్ధన్ విడుదల చేశారు. టెన్త్ మార్కుల ఆధారంగా ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో సీట్లు కేటాయించనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు <>వెబ్‌సైట్‌<<>> ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్చి 16న నోటిఫికేషన్ రానుంది. 18వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

News March 13, 2026

మూసీ అభివృద్ధికి అదే స్ఫూర్తి: రేవంత్

image

TG: మూసీ పునరుద్ధరణ కోసం దుబాయ్, సింగపూర్, లండన్, సియోల్ వంటి నగరాల్లో పర్యటించి అక్కడి నదీ అభివృద్ధి నమూనాలను స్టడీ చేశామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. ఇతర దేశాల అభివృద్ధి వేగాన్ని అందుకోవడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. నిజాం కాలంలోనే చార్మినార్ చుట్టూ స్పెషల్ ఎకనమిక్ జోన్‌ను ఏర్పాటు చేసి నగరాన్ని అభివృద్ధి చేశారని, అదే స్ఫూర్తితో మూసీ తీరాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

News March 13, 2026

మూసీ పరీవాహకం నివాసయోగ్యం కాదు: రేవంత్

image

TG: HYDలోని మూసీ పరీవాహక ప్రాంత ప్రజల పట్ల తాను కూడా సానుభూతితో ఉన్నానని CM రేవంత్ తెలిపారు. కానీ కింద ఉన్న నల్గొండ జిల్లా వాసుల పరిస్థితి అర్థం చేసుకోండని సూచించారు. ఎవరికో నష్టం కలిగించాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. ‘మూసీ పరీవాహకం నివాసయోగ్యమైనది కాదని WHO స్వయంగా నివేదిక ఇచ్చింది. అక్కడ నివసించే మహిళలకు ప్రెగ్నెన్సీ సమస్యలు వస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో పండించే పంటలు విషపూరితమైపోయాయి’ అని తెలిపారు.