News August 7, 2024
పీకల్లోతు కష్టాల్లో భారత్

శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 249 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన IND 82 రన్స్‌కే 6 కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్ 35, కోహ్లీ 20, శ్రేయస్ 8, గిల్ 6, పంత్ 6, అక్షర్ 2 పరుగులకే వెనుదిరిగారు. క్రీజులో పరాగ్, దూబే ఉన్నారు. 3 వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ టై కాగా రెండో వన్డేలో లంక విజయం సాధించింది. సిరీస్ సమం కావాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పక నెగ్గాలి.
Similar News
News February 16, 2025
తాజ్ మహల్‌ను సందర్శించిన రిషి సునాక్

బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ తాజ్ మహల్ సందర్శించారు. తన భార్య పిల్లలతో పాటు అత్తమ్మ సుధామూర్తితో కలిసి 90 నిమిషాల పాటు అక్కడ గడిపారు. ఈ పర్యటన తమ పిల్లలు ఎప్పటికీ మర్చిపోరని అతిథ్యానికి ధన్యవాదాలు అని విజిటర్ బుక్‌లో రాశారు. అయితే రిషి సునాక్ రేపు ఉదయం మరోసారి తాజ్‌మహల్ చూడటంతో పాటు ఆగ్రాలోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని ప్రస్తుతం భారత పర్యటనలోఉన్నారు.
News February 16, 2025
KCR బర్త్‌డే రోజున సామాజిక కార్యక్రమాలు: KTR

TG: BRS అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా FEB 17న సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు KTR పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎవరికి తోచిన విధంగా వారు ఇతరులకు సహాయపడేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రక్తదాన శిబిరాలు పండ్ల పంపిణీ, అన్నదానం వంటి కార్యక్రమాలు చేపట్టాలని KTR విజ్ఞప్తి చేశారు.
News February 16, 2025
WPL: ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం

ముంబైతో జరిగిన మ్యాచులో ఢిల్లీ విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు ఆఖరి బంతికి అందుకుంది. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా తొలి బంతికి నిక్కీ ప్రసాద్ ఫోర్ బాదారు. ఆ తర్వాతి 3 బంతులకు నాలుగు పరుగులు రాగా ఐదో బంతికి నిక్కీ ఔటయ్యారు. చివరి బంతికి అరుంధతి రెండు పరుగులు తీసి ఢిల్లీకి విజయాన్ని అందించారు.