News August 8, 2024

రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి రూ.7,266 కోట్లు

image

AP: రాష్ట్రంలో రూ.7,266 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. పలు కీలక ప్రాజెక్టులను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ తూర్పు బైపాస్‌కు రూ.2,716 కోట్లు, వినుకొండ-గుంటూరు రోడ్డుకు రూ.2,360 కోట్లు, సబ్బవరం-షీలానగర్ రోడ్డుకు రూ.906 కోట్లు, విజయవాడ మహానాడు జంక్షన్-నిడమానూరు రోడ్డుకు రూ.669 కోట్లు, చెన్నై-కోల్‌కతా హైవేపై రణస్థలం రహదారికి రూ.325 కోట్లు కేటాయించింది.

Similar News

News November 13, 2025

ఢిల్లీ పేలుడు.. కారులో డీఎన్ఏ ఉమర్‌దే!

image

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బ్లాస్ట్‌లో మరణించింది డాక్టర్ ఉమర్ అని అధికార వర్గాలు తెలిపాయని INDIA TODAY పేర్కొంది. కారులోని డీఎన్ఏ, ఉమర్ కుటుంబ సభ్యులతో సరిపోలిందని వెల్లడించింది. i20 కారుతో ఎర్రకోట సిగ్నల్ వద్ద ఆత్మహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది మరణించారు. కాగా ఉమర్ పేరిట ఉన్న మరో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

News November 13, 2025

ప్రభుత్వ షట్‌డౌన్ బిల్లుకు US కాంగ్రెస్ ఆమోదం

image

అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్‌కు తెరపడనుంది. దీన్ని ముగించే బిల్లుకు US కాంగ్రెస్‌లో ఆమోదం లభించింది. ఓటింగ్‌లో అనుకూలంగా 222 ఓట్లు రాగా వ్యతిరేకంగా 209 వచ్చాయి. ఈ బిల్లును సభ అధ్యక్షుడు ట్రంప్‌నకు పంపింది. ఆయన ఆమోదం అనంతరం 43 రోజుల ప్రభుత్వ షట్‌డౌన్ ముగియనుంది.

News November 13, 2025

మహిళల్లో మైగ్రేన్‌కి ఎన్నో కారణాలు

image

మైగ్రేన్‌ తలలో ఒకవైపు మాత్రమే వేధించే ఒక రకమైన తలనొప్పి. అయితే మహిళల్లో నెలసరికి ముందు, నెలసరి రోజుల్లో మైగ్రేన్ బాధలు అధికంగా ఉంటాయంటున్నారు నిపుణులు. మానసిక ఒత్తిడి, అధిక శ్రమ, ప్రకాశవంతమైన వెలుతురు, నెలసరిలో తేడాలు, గర్భ నిరోధక మాత్రలు, మత్తుపానీయాలు, ధూమపానం అలవాట్లు ఇవన్నీ మైగ్రేన్‌​ను ప్రేరేపిస్తాయంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, తగినంత నిద్ర ఉండాలని సూచిస్తున్నారు.