News August 8, 2024
హైదరాబాద్: ప్రజలకు పోలీసుల హెచ్చరిక

సైబర్ క్రైమ్ పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ‘పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడటం, OTP షేర్ చేయడం, అనుమానాస్పద లింకులను తెరవడం, బెదిరింపు కాల్స్‌కు స్పందించడం ఆపండి. ఒక్క క్లిక్ మీ జీవితాన్ని మార్చగలదు. అది సురక్షితమో కాదో నిర్ధారించుకోండి. సైబర్ క్రిమినల్స్ చేతిలో మోసపోతే వెంటనే 1930కి డయల్ చేయండి’ అంటూ రాచకొండ పోలీసులు సూచిస్తున్నారు. SHARE IT
Similar News
News January 17, 2026
హైదరాబాద్‌లో ‘ఆమె’దే హవా!

SEC నిబంధనల ప్రకారం GHMC మేయర్ పదవి మహిళా (జనరల్) కేటగిరీకి రిజర్వ్ అయ్యింది. గతంలో MCHకు రాణి కుముదిని దేవి తొలి మహిళా మేయర్. ఆ తరువాత సరోజినీ, కుముద్ నాయక్ నగరాన్ని పాలించారు. GHMC ఏర్పడ్డాక 2007లో TDP నుంచి సరస్వతి దేవి మేయర్ అయ్యారు. ఆ తర్వాత బండ కార్తీక రెడ్డి సేవలు అందించగా, ప్రస్తుతం గద్వాల్ విజయలక్ష్మి 2021 నుంచి కొనసాగుతున్నారు. ఇలా మేయర్ పీఠంపై మహిళల ముద్ర ఎప్పట్నుంచో ఉంది!
News January 17, 2026
GHMC: 300 డివిజన్ల ‘మెగా’ రిజర్వేషన్లు.. పక్కా గణాంకాలు

జీహెచ్‌ఎంసీలో విలీనమైన 27 మునిసిపాలిటీలతో ఏర్పడిన 300 డివిజన్లకు ప్రభుత్వం రిజర్వేషన్ల కోటాను ఖరారు చేసింది. ఇందులో ఎస్టీలకు 5, ఎస్సీలకు 23, బీసీలకు 122 డివిజన్లు కేటాయించారు. మిగిలిన 150లో జనరల్ మహిళలకు 76, అన్‌రిజర్వ్‌డ్‌కు 74 దక్కాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్యూమరేషన్ బ్లాకుల (EB) ఆధారంగా ఎస్సీ, ఎస్టీ జనాభాను క్రోడీకరిస్తూ వార్డుల వారీ కేటాయింపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
News January 17, 2026
పాతబస్తీ మెట్రోపై హైకోర్టు ఆరా.. ఫిబ్రవరి 4న కీలక నివేదిక!

MGBS-ఫలక్‌నుమా రూట్‌లో నిర్మించే మెట్రో లైన్ విషయంలో చారిత్రక కట్టడాల రక్షణపై హైకోర్టు దృష్టి సారించింది. చార్మినార్ వంటి కట్టడాల దృశ్య సౌందర్యం దెబ్బతినకుండా పిల్లర్ల నిర్మాణం ఎలా ఉంటుందో వర్చువల్ వాక్‌త్రూ ద్వారా FEB 4లోగా చూపాలని అధికారులను ఆదేశించింది. వారసత్వ సంపదకు నష్టం వాటిల్లని రీతిలో మెట్రో అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. దీని ఆధారంగానే 5.5KM మేర సాగే ఈ మెట్రో లైన్ ఖరారు కానుంది.


