News August 8, 2024
మాజీ ఎమ్మెల్యే కెంబూరి కన్నుమూత
AP: సీనియర్ రాజకీయ నాయకుడు కెంబూరి రామ్మోహన్ రావు(75) ఇవాళ కన్నుమూశారు. అనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఈయన టీడీపీ నుంచి 1985లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా, 1989లో బొబ్బిలి ఎంపీగా విజయం సాధించారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
Similar News
News December 20, 2024
ALERT.. నోటిఫికేషన్ విడుదల
TG: గిరిజన, బీసీ, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యాసంవత్సరం 5వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు రేపటి నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు <
News December 20, 2024
మహేశ్‌బాబు ‘ముఫాసా’ విడుదల
‘లయన్ కింగ్’కు ప్రీక్వెల్‌గా వస్తోన్న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ థియేటర్లలో రిలీజైంది. ముఫాసాకు సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ అందించడంతో థియేటర్ల వద్ద ఆయన అభిమానులు సందడి చేస్తున్నారు. స్క్రీన్‌పై బాబు కనిపించకపోయినా సింహంలో ఆయన్ను చూసుకుంటూ వాయిస్ ఎంజాయ్ చేస్తున్నారు. పుంబా పాత్రకు బ్రహ్మానందం, టీమోన్ పాత్రకు అలీ అందించిన డబ్బింగ్ నవ్వు తెప్పించిందని అంటున్నారు. మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ!
News December 20, 2024
గంటలో తిరుమల శ్రీవారి దర్శనం: BR నాయుడు
AP: తిరుమల శ్రీవారి దర్శనం గంటలో పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు TTD ఛైర్మన్ BR నాయుడు చెప్పారు. AI టెక్నాలజీని ప్రయోగాత్మకంగా వారం రోజులు పరిశీలించి దర్శనం కల్పిస్తామన్నారు. ఇందుకోసం భక్తుల ఆధార్, ఫొటో తీసుకుని దర్శనం సమయం సూచించే టోకెన్ ఇస్తారు. ఆ సమయానికి వచ్చే భక్తులను దర్శనం కోసం నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి పంపుతారు. సక్సెస్ అయితే 45 కౌంటర్లలో టోకెన్లు ఇవ్వనున్నారు.