News August 8, 2024
మాజీ ఎమ్మెల్యే కెంబూరి కన్నుమూత
AP: సీనియర్ రాజకీయ నాయకుడు కెంబూరి రామ్మోహన్ రావు(75) ఇవాళ కన్నుమూశారు. అనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఈయన టీడీపీ నుంచి 1985లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా, 1989లో బొబ్బిలి ఎంపీగా విజయం సాధించారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
Similar News
News September 8, 2024
గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ
APలో భారీ వర్షాలు, విజయవాడలో బుడమేరుతో సంభవించిన వరద పరిస్థితులను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి CM చంద్రబాబు వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు రేయింబవళ్లు అధికార యంత్రాంగం పనిచేసిందని, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలను తెలియజేశారు. వరద వల్ల భారీ నష్టం జరిగిందని గవర్నర్‌కు చెప్పారు. అటు త్వరలోనే రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
News September 8, 2024
మరో 3 జిల్లాల్లో రేపు సెలవు
APలోని ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తాజాగా 3 జిల్లాలకు సోమవారం సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లోని స్కూళ్లకు రేపు సెలవు ఇస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాలు, వరదల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా ఇప్పటికే విజయనగరం జిల్లాలో సెలవు <<14051952>>ప్రకటించిన<<>> విషయం తెలిసిందే.
News September 8, 2024
ఫోన్ ఎక్కువగా వాడేవారిలో హైపర్ టెన్షన్!
ఫోన్‌ను అతిగా వాడటం వలన అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని యూకే పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘యూరోపియన్ హార్ట్ జర్నల్-డిజిటల్ హెల్త్’లో పబ్లిష్ అయిన ఆ నివేదిక ప్రకారం.. రోజుకు 6 గంటలకంటే ఎక్కువగా ఫోన్ వాడే వారిలో హైపర్‌టెన్షన్ వచ్చే ప్రమాదం 25శాతానికి పైగా ఉంటుంది. దీని కారణంగా గుండె, కిడ్నీ జబ్బులు వచ్చే రిస్క్ కూడా తీవ్రంగా ఉంటోందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.