News August 8, 2024
స్మార్ట్ ఫోన్ యూజర్లకు బిగ్ వార్నింగ్

ఆండ్రాయిడ్ వెర్షన్లు 12, 12L, 13, 14 వాడుతున్న స్మార్ట్ ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యే ముప్పు ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) హెచ్చరించింది. వీటిలో హానికర మాల్వేర్ను సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ గుర్తించినట్లు తెలిపింది. దీనివల్ల ఫోన్లు హ్యాకై, వ్యక్తిగత సమాచారం చోరీ అయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. వెంటనే ఆండ్రాయిడ్ వెర్షన్లను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
Similar News
News November 6, 2025
వరల్డ్ కప్ విజేతలకు కార్లు గిఫ్ట్ ఇవ్వనున్న TATA

మహిళల ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు టాటా మోటార్స్ శుభవార్త చెప్పింది. త్వరలో విడుదల కానున్న Tata Sierra SUV మొదటి బ్యాచ్‌లోని టాప్ఎండ్ మోడల్‌ను జట్టులోని ప్రతి సభ్యురాలికి బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. WC విజేతలు & రీఎంట్రీ ఇస్తున్న లెజెండరీ సియెర్రా రెండూ పట్టుదల, ధైర్యం, స్ఫూర్తికి ప్రతీకలని టాటా మోటార్స్ కొనియాడింది. కాగా ఈ కారు నవంబర్ 25న లాంచ్ కానుంది.
News November 6, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

*ప్రజా సమస్యలపై YS జగన్ మరోసారి పాదయాత్ర చేస్తారని మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడి. *పత్తి రైతులను ఆదుకునేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు మంత్రి అచ్చెన్నాయుడు లేఖ. తడిసిన, రంగుమారిన పత్తిని తగిన ధరకు కొనాలని విజ్ఞప్తి. *ఈగల్ వ్యవస్థను స్థాపించాక రాష్ట్రంలో గంజాయి సాగు లేకుండా చేశామని మంత్రి అనిత వెల్లడి. ‘డ్రగ్స్ వద్దు బ్రో’ నినాదాన్ని స్కూలు స్థాయిలోకి తీసుకెళ్తున్నామని ప్రకటన.
News November 6, 2025
చేతులు మెరిసేలా..

కొందరిలో ముఖం ప్రకాశవంతంగానే ఉన్నా.. చేతులు మాత్రం జీవం కోల్పోయినట్లుగా తయారవుతాయి. దీనికోసం ఉప్పుతో తయారుచేసిన స్క్రబ్‌ని ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కొద్దిగా ఉప్పులో లావెండర్ నూనె కలిపి దాన్ని చేతులకు రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత మృదువుగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. ఈ చిట్కాను వారానికి రెండుసార్లు పాటిస్తే చేతులపై చేరిన మృతకణాలు, మురికి తొలగిపోయి మృదువుగా మారతాయి.


