News August 8, 2024
స్మార్ట్ ఫోన్ యూజర్లకు బిగ్ వార్నింగ్
ఆండ్రాయిడ్ వెర్షన్లు 12, 12L, 13, 14 వాడుతున్న స్మార్ట్ ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యే ముప్పు ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) హెచ్చరించింది. వీటిలో హానికర మాల్వేర్‌ను సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ గుర్తించినట్లు తెలిపింది. దీనివల్ల ఫోన్లు హ్యాకై, వ్యక్తిగత సమాచారం చోరీ అయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. వెంటనే ఆండ్రాయిడ్ వెర్షన్లను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
Similar News
News September 10, 2024
BIG ALERT: అతిభారీ వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News September 10, 2024
విశాఖకు మరో వందేభారత్?
AP: విశాఖకు మరో వందే భారత్ రైలును నడిపేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒడిశాలోని దుర్గ్-విశాఖపట్నం మధ్య నడిపేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఉదయం 6 గంటలకు దుర్గ్‌లో బయలుదేరి మధ్యాహ్నం 1.55 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి రాత్రి 10.50 గంటలకు దుర్గ్‌కు వెళ్తుందని తెలుస్తోంది.
News September 10, 2024
ప్రపంచంలోని 20 శాతం చెత్త భారత్‌లోనే
ప్రపంచంలోని ప్లాస్టిక్ చెత్తలో 20 శాతం భారత్‌దేనని ఓ సర్వే తెలిపింది. ఏటా 9.3 మిలియన్ల టన్నుల చెత్తను ఉత్పత్తి చేస్తోందని పేర్కొంది. భారత్ తర్వాత నైజీరియా (3.5 Mt), ఇండోనేషియా(3.4 Mt), చైనా(2.8 Mt), పాకిస్థాన్(2.6 Mt), బంగ్లాదేశ్(1.7 Mt), రష్యా(1.7 Mt), బ్రెజిల్(1.4 Mt), థాయిలాండ్(1 Mt) కాంగో (1 Mt) ఉన్నాయి. ఈ దేశాల్లో ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేసే వ్యవస్థలు లేకపోవడంతో చెత్త పెరుగుతోంది.