News August 8, 2024
కర్ణాటకతో 7 అంశాలపై AP ఒప్పందం
AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కర్ణాటక పర్యటనలో ఆ రాష్ట్రంతో 7 అంశాలపై ఒప్పందం జరిగింది. 8 కుంకీ ఏనుగులు APకి ఇచ్చేందుకు కర్ణాటక అంగీకరించింది. కర్ణాటక పట్టుకున్న ఎర్రచందనం అప్పగింత, ఎకో టూరిజం అభివృద్ధి, శాటిలైట్ నిఘాతో అటవీ సంపదను రక్షించుకోవడం, వేటగాళ్లను నియంత్రించడం, వన్యప్రాణుల వేట విషయంలో ఉమ్మడి కార్యాచరణతో పోరాడాలని, అడవుల రక్షణపై సమిష్టిగా ముందుకెళ్లాలని పవన్ ఒప్పందాలు చేసుకున్నారు.
Similar News
News January 18, 2025
సైఫ్‌పై దాడిలో ఆధారాలు గుర్తింపు: ఫడ్నవీస్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటనలో పోలీసులు కొన్ని ఆధారాలను గుర్తించినట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి చిత్రాలను స్పష్టంగా కనుగొన్నట్లు పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, అతి త్వరలోనే నిందితుడిని పోలీసులు పట్టుకుంటారని చెప్పారు. కాగా బాలీవుడ్ స్టార్లపై వరుస దాడుల నేపథ్యంలో మహా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
News January 18, 2025
నేడు రాష్ట్రానికి అమిత్ షా
AP: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం గన్నవరం చేరుకొని అక్కడి నుంచి ఉండవల్లి వెళ్లి చంద్రబాబు నివాసంలో విందుకు హాజరుకానున్నారు. అనంతరం విజయవాడలోని హోటల్‌లో బస చేయనున్నారు. రేపు గన్నవరంలో సమీపంలోని NIDM సెంటర్, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ప్రాంగణాలను ఆయన ప్రారంభిస్తారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌తోనూ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
News January 18, 2025
ముడా కేసులో సిద్ధ రామయ్యకు ఈడీ షాక్
ముడా మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధ రామయ్యకు ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనతో పాటు ఇతరులకు చెందిన రూ.300 కోట్ల విలువైన 142 ఆస్తులను అటాచ్ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తాను ఎలాంటి తప్పు చేయలేదని, విపక్షాలు తనపై రాజకీయ కక్షతోనే కుట్ర పన్నారని సీఎం చెబుతున్నారు.