News August 9, 2024
ఎన్ని రూ.కోట్లు ఇచ్చినా..!

పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ రేసు నుంచి డిస్క్వాలిఫై అయిన వినేశ్ ఫొగట్ హరియాణా ప్రభుత్వం రూ.4కోట్ల నజరానా ప్రకటించింది. ఆమె చదువుకున్న లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీ రూ.25లక్షలు ఇస్తామని తెలిపింది. ఆమెపై గౌరవం, సానుభూతితో రివార్డులు ప్రకటిస్తున్నా.. మెడల్ సాధించలేకపోయాననే బాధే వినేశ్‌ను తొలిచేస్తోందేమో! ఎన్ని రూ.కోట్లు ఇచ్చినా ఒలింపిక్స్ పతకానికి సాటి రావు. సగటు క్రీడాకారుడి జీవితలక్ష్యమది.
Similar News
News August 31, 2025
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఆందోళన!

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు <<17568780>>సన్నాహకాలు<<>> మొదలయ్యాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. కొందరు ఇప్పుడిప్పుడే పనులు స్టార్ట్ చేస్తుండగా, మరికొందరివి చివరి దశకు చేరుకున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పథకానికి బ్రేక్ పడుతుందేమో? డబ్బులు రాకపోతే నిర్మాణమెలా? అన్న సందేహాలతో సతమతమవుతున్నారు. అయితే ఆందోళన అవసరం లేదని, ఎన్నికల తర్వాత కూడా పథకం కొనసాగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
News August 31, 2025
పర్యాటక రంగంలో రూ.12వేల కోట్ల పెట్టుబడులు: దుర్గేశ్

AP: రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఇప్పటివరకు ఈ రంగానికి ₹12వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. టూరిస్టు సర్క్యూట్లను ఏర్పాటు చేస్తున్నామని, లంబసింగి, వంజంగి, అఖండ గోదావరి, గండికోట, సూర్యలంక బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అటు విశాఖ MGM గ్రౌండ్స్‌లో SEP 5 నుంచి 3 రోజుల పాటు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ జరగనుంది.
News August 31, 2025
ఉద్యోగుల ఖాతాల్లోకి పెండింగ్ బిల్లులు

TG: ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించి దాదాపు ₹700 కోట్లను వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఉద్యోగుల సప్లిమెంటరీ వేతన బిల్లులు ₹392 కోట్లు, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కింద మరో ₹308 కోట్లను ప్రభుత్వం చెల్లించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఇంకా ₹10వేల కోట్ల వరకు బిల్లులు రావాలని తెలిపారు. కాగా ఉద్యోగుల బిల్లులకు ప్రతి నెలా రూ.700 కోట్లు చెల్లిస్తామని జూన్‌లో ప్రభుత్వం ప్రకటించింది.