News August 9, 2024

ఎన్ని రూ.కోట్లు ఇచ్చినా..!

image

పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ రేసు నుంచి డిస్‌క్వాలిఫై అయిన వినేశ్ ఫొగట్‌ హరియాణా ప్రభుత్వం రూ.4కోట్ల నజరానా ప్రకటించింది. ఆమె చదువుకున్న లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీ రూ.25లక్షలు ఇస్తామని తెలిపింది. ఆమెపై గౌరవం, సానుభూతితో రివార్డులు ప్రకటిస్తున్నా.. మెడల్ సాధించలేకపోయాననే బాధే వినేశ్‌ను తొలిచేస్తోందేమో! ఎన్ని రూ.కోట్లు ఇచ్చినా ఒలింపిక్స్‌ పతకానికి సాటి రావు. సగటు క్రీడాకారుడి జీవితలక్ష్యమది.

Similar News

News September 13, 2024

BREAKING: మరో అల్పపీడనం

image

AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు IMD వెల్లడించింది. ఇది ఆగ్నేయ బంగ్లాదేశ్ సమీపంలో కేంద్రీకృతమైందని, క్రమంగా బలపడుతోందని తెలిపింది. రేపటికి వాయుగుండంగా మారనుందని పేర్కొంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు పడతాయని ప్రకటించింది. కాగా ఇవాళ విశాఖలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలుచోట్ల ఉరుములతో కూడిన వాన కురుస్తోంది.

News September 13, 2024

నందిగం సురేశ్‌కు పోలీస్ కస్టడీ

image

AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మంగళగిరి అడిషనల్ జూనియర్ సివిల్ కోర్టు తీర్పిచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనను ఈనెల 5న హైదరాబాద్‌లో మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణకు సహకరించడం లేదని, 8 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే ఈనెల 15-17 వరకు 2 రోజులకే కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం సురేశ్ గుంటూరు జైలులో ఉన్నారు.

News September 13, 2024

రైలులో బాలికపై లైంగిక వేధింపులు.. కొట్టి చంపేసిన ప్రయాణికులు

image

బరౌనీ(బిహార్) నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌లో 11ఏళ్ల బాలికపై రైల్వే ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తల్లి వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు ఈ దారుణానికి తెగబడ్డాడు. చిన్నారి ఏడుస్తూ తల్లికి విషయం చెప్పగా, ఆమె మరో బోగీలోని కుటుంబీకులకు సమాచారాన్ని అందించింది. తోటి ప్రయాణికులతో కలిసి వారు అతడిని చితకబాదారు. పోలీసులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు చనిపోయాడు.