News August 9, 2024
కవితకు బెయిల్ వస్తుందని ఆశిస్తున్నాం: KTR

TG: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ CM కేజ్రీవాల్‌తో పాటు తన సోదరి, MLC కవితకు త్వరలోనే బెయిల్ వస్తుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ CM సిసోడియాకు బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయినా ఛార్జిషీట్ దాఖలు చేశాక జైల్లో ఉంచాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. జైల్లో ఉన్న కవిత 11KGల బరువు తగ్గారని ఆయన అన్నారు.
Similar News
News July 6, 2025
అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ నేవీలో మ్యుజిషియన్ విభాగంలో అగ్నివీర్ నియామకాలకు <
News July 6, 2025
సీక్రెట్ కెమెరాలను ఎలా గుర్తించాలంటే?

మహిళలు పబ్లిక్ టాయిలెట్లు, ఛేంజింగ్ రూమ్‌లు, హోటల్ గదులకు వెళ్లినప్పుడు అక్కడి <<16963972>>వస్తువులను<<>> నిశితంగా పరిశీలించాలి. గదుల్లో లైట్ ఆఫ్ చేసి, LED లైట్ వంటివి కనిపిస్తాయో చెక్ చేయాలి. అద్దంపై వేలు పెట్టి చూస్తే మీ వేలుకి, అద్దంలో వేలు ప్రతిబింబానికి మధ్య గ్యాప్ లేకపోతే అక్కడ ఏదో ఉందని అనుమానించాలి. సీక్రెట్ కెమెరాల డిటెక్ట్ యాప్‌లు ఉన్నా వాటిలో చాలావరకు మోసపూరితమైనవేనని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
News July 6, 2025
మహిళల బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు.. ఎక్కడెక్కడ పెడతారంటే?

ఇటీవల బెంగళూరు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగి నగేశ్ ఆఫీస్‌లోని బాత్రూమ్‌లో మహిళల వీడియోలు చిత్రీకరిస్తూ పట్టుబడ్డాడు. అయితే సీక్రెట్ కెమెరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఎక్కువగా అద్దం వెనుక, తలుపు వద్ద, గోడ మూలల్లో, పైకప్పు సీలింగ్, బల్బులో, టిష్యూ పేపర్ బాక్స్‌లో, స్మోక్ డిటెక్టర్‌లో పెట్టే అవకాశం ఉందంటున్నారు. అప్రమత్తతతో వీటిని గుర్తించవచ్చని చెబుతున్నారు.