News August 9, 2024

కవితకు బెయిల్ వస్తుందని ఆశిస్తున్నాం: KTR

image

TG: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ CM కేజ్రీవాల్‌తో పాటు తన సోదరి, MLC కవితకు త్వరలోనే బెయిల్ వస్తుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ CM సిసోడియాకు బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయినా ఛార్జిషీట్ దాఖలు చేశాక జైల్లో ఉంచాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. జైల్లో ఉన్న కవిత 11KGల బరువు తగ్గారని ఆయన అన్నారు.

Similar News

News September 9, 2024

సీఎం మమత చెప్పేవి అబద్ధాలు: ట్రైనీ డాక్టర్ తల్లి

image

కోల్‌కతాలో హత్యాచారానికి గురైన వైద్యురాలి పేరెంట్స్‌కు పోలీసులు లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలను CM మమత ఖండించారు. దీంతో ఆమెపై మృతురాలి తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. CM అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ‘మీకు పరిహారం ఇప్పిస్తానని CM అన్నారు. మీ కూతురి జ్ఞాపకార్థం ఏదైనా నిర్మించుకోవచ్చన్నారు. అయితే నా కుమార్తెకు న్యాయం జరిగినప్పుడు మీ ఆఫీస్‌కు వచ్చి పరిహారం తీసుకుంటానని చెప్పా’ అని పేర్కొన్నారు.

News September 9, 2024

‘మేనన్’ నా ఇంటి పేరు కాదు: హీరోయిన్ నిత్య

image

విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యామేనన్ తన పేరు గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘మేనన్’ అనేది తన ఇంటి పేరు కాదని తెలిపారు. ‘నా అసలు పేరు ఎన్ఎస్ నిత్య. కులాన్ని పేర్లతో ముడిపెట్టడం నచ్చక మా కుటుంబంలో ఎవరూ ఇంటి పేరు వాడరు. నటిగా పలు చోట్లకు ప్రయాణాలు చేయాల్సి రావడంతో న్యూమరాలజీ ఆధారంగా పాస్‌పోర్టులో ‘మేనన్’ అని జత చేశాం’ అని చెప్పుకొచ్చారు.

News September 9, 2024

ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు.. వివరాలు ఇవే

image

AP: నిన్నటి నుంచి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిశాయి. సెప్టెంబర్ 8 ఉ.8.30 నుంచి 9వ తేదీ ఉ.8.30 గంటల వరకు వర్షపాతం వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో 115 నుంచి 204 మి.మీ వరకు వర్షం పడింది. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షపాతం వివరాలను పై ఫొటోలో చూడొచ్చు.