News August 9, 2024

ఛైర్మ‌న్ తీరుపై జ‌యా అభ్యంత‌రం

image

రాజ్య‌స‌భ ఛైర్మ‌న్‌, ఎస్పీ ఎంపీ జ‌యా బ‌చ్చ‌న్ మ‌ధ్య మ‌రోసారి పేరు వివాదం తలెత్తింది. ఛైర్మ‌న్ ధ‌న్‌ఖ‌డ్ మ‌రోసారి జ‌యా అమితాబ్ బ‌చ్చ‌న్‌ అని పిలవ‌డంపై ఆమె అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని జయా డిమాండ్ చేయగా తనకు పాఠాలు చెప్ప‌వద్దంటూ ఛైర్మన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌యాకు సోనియా మ‌ద్ద‌తుగా నిలవగా ఛైర్మ‌న్ తీరును నిర‌సిస్తూ విప‌క్షాలు వాకౌట్ చేశాయి.

Similar News

News February 18, 2026

మరోసారి అభిషేక్ డకౌట్

image

T20WC: భారత డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశ పరిచారు. పసికూన నెదర్లాండ్స్‌పై పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. ఇన్నింగ్స్ మూడో బంతికే ఆర్యన్ దత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. కాగా అభిషేక్ ఈ ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ డకౌట్ కావడం గమనార్హం.

News February 18, 2026

PHOTO GALLERY: విశాఖలో మిలాన్-2026 రిహార్సల్స్

image

AP: విశాఖ సాగరతీరంలో ఈ సాయంత్రం మిలాన్-2026 రిహార్సల్స్ జరిగాయి. యుద్ధనౌకలు సందడి చేశాయి. 45 భారతీయ నౌకలతో పాటు మొత్తం 71 యుద్ధనౌకలు, సబ్ మెరైన్లు, ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు ప్రదర్శనలో పాల్గొన్నాయి. పెద్దఎత్తున విశాఖ ప్రజలు ఈ విన్యాసాలను వీక్షించారు. రేపు మిలాన్-2026 జరగనుంది.

News February 18, 2026

బంగాళదుంపతో బ్యూటిఫుల్ స్కిన్

image

బంగాళాదుంపలో బ్లీచింగ్ లక్షణాలు పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. దీన్ని ఎలా వాడాలంటే..* బంగాళదుంప రసానికి తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. * బంగాళదుంప రసానికి పెరుగు కలిపి ముఖానికి రాసి పావుగంట తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ చర్మంపై ఉండే మలినాలను తొలగిస్తుంది.