News August 9, 2024

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు

image

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం జేపీసీ(జాయింట్ పార్లమెంటరీ కమిటీ) ఏర్పాటు చేసింది. మొత్తం 21 మంది లోక్‌సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో తెలంగాణ నుంచి డీకే అరుణ, అసదుద్దీన్ ఒవైసీకి, ఏపీ నుంచి లావు కృష్ణ దేవరాయలుకి చోటు దక్కింది. జేపీసీలో సభ్యులు కాబోయే రాజ్యసభ ఎంపీల పేర్లను త్వరలోనే ప్రకటించనున్నారు

Similar News

News November 12, 2025

ఢిల్లీ పేలుడు: తబ్లీగీ జమాత్ మసీదులో 15 నిమిషాలు గడిపి..

image

ఢిల్లీ పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఉమర్ నబీకి సంబంధించి కీలక విషయాలు బయటపడుతున్నాయి. బ్లాస్ట్‌కు ముందు ఓల్డ్ ఢిల్లీలోని తబ్లీగీ జమాత్ మసీదుకు అతడు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ 10-15 నిమిషాలు గడిపాడని, తర్వాత ఎర్రకోటలోని పార్కింగ్ ప్లేస్‌కు వెళ్లాడని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. అతడు మసీదులోకి వచ్చి వెళ్లిన ఫుటేజీ సీసీటీవీలో రికార్డయిందని చెప్పాయి.

News November 12, 2025

శీతాకాలంలో ఆహారాన్ని మళ్లీ వేడి చేస్తే జరిగేది ఇదే?

image

చలికాలంలో వేడివేడిగా తినాలనే ఉద్దేశంతో చాలామంది ఆహారాన్ని మళ్లీ వేడి చేసుకుంటారు. పదే పదే ఆహారాన్ని వేడి చేస్తే పోషకాలు తగ్గడంతోపాటు బ్యాక్టీరియా పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. బియ్యం, బంగాళాదుంపలు, పుట్టగొడుగులు, చికెన్, గుడ్లలో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా పెరిగి కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్‌కి కారణమవుతుంది. నూనెలు, మసాలాలు ఆక్సిడైజ్ అవుతాయి.

News November 12, 2025

క్రికెట్ న్యూస్ రౌండప్

image

⭒ AFG-U19 జట్టుతో జరిగే సిరీస్ కోసం భారత U-19 క్రికెట్ టీమ్‌కు ఎంపికైన HYD పేసర్ మహ్మద్ అబ్దుల్ మాలిక్
⭒ రేపు రాజ్‌కోట్ వేదికగా మ.1.30 నుంచి IND-A, SA-A మధ్య తొలి అనధికార ODI
⭒ టెస్ట్ టీమ్ నుంచి నితీశ్ రెడ్డిని రిలీజ్ చేసిన BCCI.. SA-A వన్డే సిరీస్‌లో ఆడనున్న నితీశ్.. రెండో టెస్ట్ నాటికి తిరిగి జట్టులో చేరిక
⭒ INDతో టెస్ట్ సిరీసే నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఛాలెంజ్: SA హెడ్ కోచ్ శుక్రి కొన్రాడ్