News August 9, 2024
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం జేపీసీ(జాయింట్ పార్లమెంటరీ కమిటీ) ఏర్పాటు చేసింది. మొత్తం 21 మంది లోక్‌సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో తెలంగాణ నుంచి డీకే అరుణ, అసదుద్దీన్ ఒవైసీకి, ఏపీ నుంచి లావు కృష్ణ దేవరాయలుకి చోటు దక్కింది. జేపీసీలో సభ్యులు కాబోయే రాజ్యసభ ఎంపీల పేర్లను త్వరలోనే ప్రకటించనున్నారు
Similar News
News September 14, 2024
MBUపై ఆరోపణలు.. విద్యార్థులకు మంచు మనోజ్ సపోర్ట్
AP: నటుడు మోహన్ బాబుకి చెందిన శ్రీవిద్యానికేతన్, MB యూనివర్సిటీల్లో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని స్టూడెంట్స్, తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న వేళ మంచు మనోజ్ ట్వీట్ చర్చనీయాంశమైంది. ‘ప్రస్తుత పరిస్థితి బాధించింది. ఈ సమయంలో విద్యార్థులకు సపోర్ట్‌గా ఉంటా. నా తండ్రి మోహన్ బాబు విద్యార్థుల శ్రేయస్సుకే ప్రాధాన్యమిస్తారు. ఫిర్యాదులను నా మెయిల్‌కు పంపండి. నా తండ్రి దృష్టికి తీసుకెళ్తా’ అని చెప్పారు.
News September 14, 2024
ఉత్సవాల్లో పిచ్చివేషాలు.. ఆకతాయిలపై షీ టీమ్స్ పంజా
TG: గణేశ్ ఉత్సవాల్లో మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన ఆకతాయిలపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝళిపించారు. మొత్తం 285 మంది ఆకతాయిలను షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి. ఉత్సవాల్లో మహిళల భద్రతపై షీటీమ్స్ ప్రత్యేక నిఘా పెట్టినట్లు మహిళా పోలీస్ విభాగం తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
News September 14, 2024
విషాదం: టీ పౌడర్ అనుకొని..
AP: తూ.గో జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టీ పౌడర్ అనుకుని పొరపాటున వృద్ధదంపతులు పురుగుమందు కలిపిన టీ తాగి చనిపోయారు. రాజానగరం(M) పల్లకడియంకు చెందిన గోవింద్(75), అప్పాయమ్మ(70) ఇంటిముందు ఓ కోతి పురుగుమందు ప్యాకెట్ తీసుకొచ్చి పడేసింది. కంటిచూపు మందగించిన అప్పాయమ్మ దాన్ని టీపౌడర్ అనుకొని టీ పెట్టి భర్తకిచ్చి, తానూ తాగింది. కాసేపటికే నురగలు కక్కుతూ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.