News August 9, 2024
ఫొగట్ అభ్యర్థనపై స్పందించిన కోర్టు

పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో ఫైనల్ చేరిన తనకు సిల్వర్ మెడల్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ చేసిన అభ్యర్థనపై CAS(కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్) స్పందించింది. ఈ ఒలింపిక్ క్రీడలు ముగిసేలోపు నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. కాగా 100గ్రాముల అధిక బరువు వల్ల ఫైనల్స్‌లో పాల్గొనకుండా ఆమెపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. <<-se>>#Olympics2024<<>>
Similar News
News April 4, 2026
ఖాళీ కడుపుతో మద్యం తాగితే..

మద్యం ప్రియులు కొన్ని చిట్కాలతో ఆల్కహాల్ దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చని ఎక్స్‌పర్టులు సూచిస్తున్నారు. ‘బింజ్ డ్రింకింగ్(తక్కువ సమయంలో ఎక్కువ తాగడం) మానుకోవాలి. తాగేటప్పుడు స్మోక్/వేప్ చేయొద్దు. ఖాళీ కడుపుతో లిక్కర్ తీసుకోవద్దు. 2లేదా అంతకన్నా ఎక్కువ డ్రింక్స్ కలపొద్దు. వీటి వల్ల హ్యాంగోవర్, ఇతర ఆరోగ్య సమస్యలొస్తాయి. కాలేయంలో అసిటాల్డిహైడ్ అనే క్యాన్సర్ కారక టాక్సిన్ ఏర్పడుతుంది’ అని అంటున్నారు.
News April 4, 2026
ఒక లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180.. వైరల్

ఎండల కారణంగా కొబ్బరి నీళ్లకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు రేట్లను భారీగా పెంచారు. బోండాలను కాకుండా లీటర్ల రూపంలో అమ్మడం అధికమైంది. బెంగళూరులో లీటర్ కోకోనట్ వాటర్ ₹180 అంటూ వెలసిన బోర్డులు వైరలవుతున్నాయి. HYD, విజయవాడ, విశాఖలోనూ లీటర్ రేటు ₹120-140గా ఉంది. మీ ప్రాంతంలో రేటు ఎలా ఉంది?