News August 10, 2024

ఆగస్టు 10: చరిత్రలో ఈ రోజు

image

1894: మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి జననం
1914: ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ రచయిత శంకరంబాడి సుందరాచారి జననం
1945: అమెరికా దేశ రాకెట్ల పితామహుడు రాబర్ట్ గొడ్డార్డ్ మరణం
● నేడు ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం
● ప్రపంచ సింహాల దినోత్సవం

Similar News

News September 17, 2025

ఈ నెల 23 నుంచి ఓటీటీలోకి ‘సుందరకాండ’

image

నారా రోహిత్, శ్రీదేవి, వర్తి వాఘని ప్రధాన పాత్రల్లో నటించిన ‘సుందరకాండ’ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 23 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుందని మూవీ యూనిట్ తెలిపింది. ఈ చిత్రం గత నెల 27న థియేటర్లలో రిలీజైంది.

News September 17, 2025

కాసేపట్లో యూఏఈతో మ్యాచ్.. హోటల్‌లోనే పాక్ ఆటగాళ్లు

image

ఆసియా కప్‌లో భారత్‌తో హ్యాండ్ షేక్ వివాదం నేపథ్యంలో పాకిస్థాన్ హర్ట్ అయిన విషయం తెలిసిందే. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేసింది. లేదంటే ఇవాళ యూఏఈతో మ్యాచ్ ఆడబోమని చెప్పింది. ఈక్రమంలోనే రా.8 గంటలకు యూఏఈతో మ్యాచ్ జరగాల్సి ఉండగా, పాక్ ఆటగాళ్లు హోటల్ రూమ్‌లోనే ఉండిపోయారు. మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

News September 17, 2025

మైథాలజీ క్విజ్ – 8 సమాధానాలు

image

1. మైథిలి అంటే ‘సీతాదేవి’. మిథిలా నగరానికి రాజైన జనకుడి పుత్రిక కాబట్టి ఆమెను మైథిలి అని పిలుస్తారు.
2. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల ప్రధాన సైన్యాధిపతి ‘ధృష్టద్యుమ్నుడు’. ఆయన ద్రౌపదికి సోదరుడు.
3. ‘పూతన’ అనే రాక్షసిని చంపింది శ్రీకృష్ణుడు.
4. విష్ణువు శయనించే పాము పేరు ‘ఆది శేషుడు’. ఈ సర్పానికి ‘అనంత’ అనే పేరు కూడా ఉంది.
5. బృహదీశ్వర ఆలయం తమిళనాడులోని తంజావూరు నగరంలో ఉంది. <<-se>>#mythologyquiz<<>>